ఆ మెడిక‌ల్ షాపుల‌ను సీజ్ చేయండి.. మంత్రి ఆదేశాలు

ఆ మెడిక‌ల్ షాపుల‌ను సీజ్ చేయండి.. మంత్రి ఆదేశాలు

ఓవైపు క‌రోనా వైర‌స్ ప్ర‌పంచాన్ని వ‌ణికిస్తుంటే... మ‌రోవైపు క‌రోనానే క్యాష్ చేసుకుంటున్నారు... ఇప్ప‌టికే కొన్ని ప్రైవేట్ ఆస్ప‌త్రులు క‌రోనా రోగుల‌కు ల‌క్ష‌ల్లో బిల్లులు వేసి.. ముక్కుపిండి మ‌రీ డ‌బ్బులు వ‌సూలు చేస్తుండ‌గా.. ఇక‌, కొన్ని మెడిక‌ల్ షాపులు కూడా కోవిడ్ మందుల‌ను అధిక ధ‌ర‌ల‌కు విక్ర‌యిస్తూ.. ప్ర‌జ‌ల‌ను మోసం చేస్తున్నాయి.. ఈ వ్య‌వ‌హారంపై ఆగ్ర‌హం వ్య‌క్తం చేసిన మంత్రి వేముల ప్ర‌శాంత్‌రెడ్డి.. కోవిడ్ మందులు అధిక ధరకు విక్రయించే మెడికల్ షాపులను గుర్తించి.. వెంట‌నే సీజ్ చేయాలంటూ నిజామాబాద్ జిల్లా కలెక్టర్, డ్ర‌గ్ కంట్రోల్ అధికారుల‌ను ఆదేశించారు. జిల్లాలో 70 వెంటి లేటర్లు అందుబాటులోకి వ‌చ్చాయ‌న్న మంత్రి.. ఐసోలేషన్ బెడ్లు 450కి పెంచేందుకు వెంటనే 68 లక్షలు మంజూరు చేయ‌నున్న‌ట్టు హామీ ఇచ్చారు. జిల్లాకు కోవిడ్ అత్యవసర మందులు పంపాలని ఆరోగ్యశాఖ మంత్రి ఈట‌ల రాజేంద‌ర్‌ని కోరారు ప్ర‌శాంత్‌రెడ్డి.. దీంతో.. మంగ‌ళ‌వారం జిల్లాకు చేరుకోనున్నాయి కోవిడ్ అత్యవసర మందులు.