ఆమంచి ఎందుకు పార్టీ మారారో...!?

ఆమంచి ఎందుకు పార్టీ మారారో...!?

చీరాల ఎమ్మెల్యే ఆమంచి కృష్ణమోహన్.. టీడీపీకి గుడ్‌బై చెప్పి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. అయితే, పార్టీ వీడే యోచనలో ఉన్న సమయంలోనే ఆమంచిని కలిసి బుజ్జగించే ప్రయత్నాలు చేశారు మంత్రి సిద్ధా రాఘవరావు... ఆయనే స్వయంగా సీఎం చంద్రబాబు దగ్గరకు కూడా తీసుకెళ్లారు. అయినా, ఆమంచి పార్టీని వీవడడంపై స్పందించిన మంత్రి సిద్ధా రాఘవరావు.. పార్టీ మారను అని చెప్పిన ఆమంచి కృష్ణమోహన్ ఎందుకు పార్టీ మారారో తెలియదన్నారు. ఆమంచి పార్టీ వీడటం వల్ల పార్టీకి ఇబ్బందేమీలేదన్న మంత్రి... పార్టీలో ఆమంచికి ప్రాధాన్యత ఇచ్చాం.. ఇప్పుడు సీఎం చంద్రబాబుపై ఆమంచి విమర్శలు సరైందికాదన్నారు. పార్టీ మారటం అనేది ఆయన ఇష్టం.. కానీ, పార్టీ మారిన వెంటనే విమర్శలు బాధ్యతారహిత్యమన్నారు రాఘవరావు. పసుపు కుంకుమ కార్యక్రమంపై విమర్శలు, డ్వాక్రా సంఘాలను ఆదుకోవడం గురించి ఆమంచి తెలుసుకోవాలని సూచించిన ఆయన... చీరాలలో కరణం బలరాం పోటీ చేస్తారా? వేరే వాళ్ళు పోటీ చేస్తారా? అనేది సీఎం చంద్రబాబు నిర్ణయిస్తారని స్పష్టంచేశారు. చంద్రబాబు నేనున్నా అని ఆమంచికి హామీ ఇచ్చినా పార్టీ ఎందుకు మారారో అర్థం కావడంలేదన్నారు మంత్రి సిద్ధా రాఘవరావు.