జేసీ దివాకర్ రెడ్డి.. జానీ వాకర్ రెడ్డిలా వ్యవహరిస్తున్నారు..

జేసీ దివాకర్ రెడ్డి.. జానీ వాకర్ రెడ్డిలా వ్యవహరిస్తున్నారు..

జేసీ దివాకర్‌రెడ్డిపై మంత్రి శంకర్ నారాయణ సంచలన వ్యాఖ్యలు చేశారు.  దివాకర్‌ రెడ్డి నోటికొచ్చినట్లు మాట్లాడుతున్నారని.. బస్సులు, మైనింగ్ విషయంలో ఎన్ని అక్రమాలకు పాల్పడ్డారో అందరికీ తెలుసునని విమర్శించారు. జేసీ దివాకర్‌ రెడ్డి... జానీ వాకర్ రెడ్డిగా మాట్లాడుతున్నాడని.. ఇలాగే మాట్లాడితే అనంతపురం ప్రజలు మీ నాలుక కోసేస్తారని హెచ్చరించారు.  చంద్రబాబు ఎంత మోసకారో రాష్ట్ర ప్రజలకు తెలుసు అని.. రైతులను, డ్వాక్రా మహిళలను మోసం చేసి 420గా ముద్ర పడిన వ్యక్తి చంద్రబాబు అని ఫైర్‌ అయ్యారు. దివాకరరెడ్డి.. సీఎం జగన్‌ గురించి మాట్లాడడం దారుణమని.. దివాకర్‌రెడ్డి కుటుంబ అకృత్యాల గురించి తాడిపత్రిలో అందరికీ తెలుసని పేర్కొన్నారు.  దేశంలో ఎక్కడాలేని విధంగా రాష్ట్రంలో సంక్షేమ పథకాలు అమలవుతున్నాయని.. ఏడాదిన్నరలో 70 వేల కోట్ల సంక్షేమ పథకాలు ప్రజలకు అందించామని తెలిపారు.