ఎన్నికల్లో ఓట్లు అడగడానికి సిగ్గుపడాలి....

ఎన్నికల్లో ఓట్లు అడగడానికి సిగ్గుపడాలి....

మానుకోట రాళ్ల చరిత్ర తెలువని సంజయ్ వాటి గురించి మాట్లాడితే వాటితోనే సమాధి చేస్తాము అని మంత్రి సత్యవతి రాథోడ్ అన్నారు. తెలంగాణ రాష్ట్రానికి, మహబూబాబాద్ కు బిజెపి వల్ల నేరుగా జరిగిన మేలు ఒక్కటి చెప్పి ఈ ప్రాంత ఓట్లు అడగాలని డిమాండ్ చేస్తున్నా... తెలంగాణకు రావల్సిన సంస్థలు రాకుండా అడ్డుకుంటూ...ఎన్నికల్లో ఓట్లు అడగడానికి సిగ్గుపడాలి అన్నారు. రైల్వే కోచ్ ఫ్యాక్టర్టీ గురించి అబద్దాలు చెబుతూ పబ్బం గడుపుకునే పనిచేస్తున్నారు...ఈ కోచ్ ఫ్యాక్టరీ వస్తే రైల్వేలో ఉమ్మడి వరంగల్ కు పూర్వ వైభవం వచ్చేది. బయ్యారం ఉక్కు తెలంగాణ హక్కు...కేంద్రం ఈ ప్రాజెక్టు ఇవ్వకపోతే తెలంగాణ ప్రభుత్వమే ఫ్యాక్టరీ నిర్మిస్తుంది. గిరిజన యూనివర్శిటీ రాకుండా చేస్తుంది, గిరిజన రిజర్వేషన్లను 10శాతం పెంచకుండా అడ్డుకుంటుంది బిజెపినే అన్నారు. తెలంగాణ ప్రభుత్వం వచ్చాకే ఉద్యోగులకు గణనీయంగా వేతనాలు పెరిగాయి...1,33,000 ఉద్యోగాలు వచ్చాయి..ప్రభుత్వ సంస్థల పరిరక్షణ జరిగింది. కాంట్రాక్టు ఉద్యోగులు రెగ్యులరైజ్ చేసింది...2వేల కోట్లు ఇచ్చి ఆర్టీసిని ఆదుకుంది తెలంగాణ ప్రభుత్వమే అని తెలిపారు. బిజెపి ప్రభుత్వ రంగ సంస్థలను అదానీ, అంబానీలకు అమ్ముతూ ఉద్యోగులను రోడ్డున పడేస్తోంది. నూరేళ్ల చరిత్ర ఉన్న కాంగ్రెస్ కాలం తీరి కూలింది. అధ్యక్ష పీఠాన్ని ఎక్కేందుకు ముందుకు రాని పరిస్థితి. రాష్ట్రంలో నలుగురు నాలుగు దిక్కుల్లో దిక్కులేకుండా ఉన్నారు. స్థానికుడు కానీ, గ్రాడ్యుయేట్ కానీ రాములు నాయక్ ను ఇక్కడ అభ్యర్థిగా పెట్టుకునే దుస్థితిలో కాంగ్రెస్ పార్టీ ఉంది. కొత్త పార్టీల ప్రశ్నించే గొంతుకలు కాదు కావాల్సింది...పరిష్కరించే కేసిఆర్ వంటి నాయకుడని పట్టభద్రులు గమనించాలని విజ్ణప్తి చేస్తున్నాను అని మంత్రి పేర్కొన్నారు.