సచివాలయ పరీక్షలకు సర్వం సిద్ధం: మంత్రి పెద్దిరెడ్డి

సచివాలయ పరీక్షలకు సర్వం సిద్ధం: మంత్రి పెద్దిరెడ్డి

ఏపీ మంత్రి పెద్దిరెడ్డి జిల్లా కలెక్టర్లు, ఎస్పీలతో బుధవారం వీడియో కాన్ఫెరెన్స్‌ నిర్వహించారు. పంచాయతీరాజ్ కమిషనర్ కార్యాలయం నుంచి గ్రామ, వార్డు సచివాలయాల పోస్ట్‌ల భర్తీపై అధికారులతో సమీక్షించారు. ఈ సందర్భంగా పెద్దిరెడ్డి అధికారులకు పలు సూచనలు చేశారు. కోవిడ్ నేపథ్యంలో సచివాలయ పోస్ట్‌ల భర్తీలో ప్రత్యేక జాగ్రత్తలు తీసుకోవాలి అని సూచించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..  16,208 ఖాళీ పోస్టులకు 10,56,931 మంది దరఖాస్తు చేసుకున్నారని... ఈనెల 20 నుంచి పరీక్షలు ప్రారంభమవుతున్నాయని పేర్కొన్నారు.  మొత్తం 7 రోజుల పాటు 14 రకాల పరీక్షలు నిర్వహిస్తున్నామన్నారు.  20వ తేదీన 6,81,664 మంది పరీక్షలకు హాజరు కానున్నారని...  మొదటి రోజు ఉదయం 2,221 కేంద్రాలలో, మధ్యాహ్నం 1068 కేంద్రాల్లో పరీక్షలు నిర్వహించడానికి  సర్వం సిద్ధం చేశామని వెల్లడించారు. కరోనా పాజిటీవ్ వున్న అభ్యర్ధులకు ఐసోలేషన్ రూంలను సిద్దం చేశామని తెలిపారు.