ఆడియో టేపుపై స్పందించిన మంత్రి.. అలా అయితే రాజీనామా చేస్తా..!

ఆడియో టేపుపై స్పందించిన మంత్రి.. అలా అయితే రాజీనామా చేస్తా..!

తెలంగాణ మంత్రి మల్లారెడ్డి.. రియల్టర్‌ను బెదిరించి ఓ ఆడియో టేప్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారిపోయింది.. వెంచర్ వేసినందకు తనకు మామూళ్లు ఎందుకు ఇవ్వలేదు? అంటూ రియల్టర్‌ను ప్రశ్నించారు మంత్రి మల్లారెడ్డి.. సర్పంచ్‌కు మామూళ్లు ఇస్తే సరిపోతుందా? 50 ఎకరాల్లో వెంచర్ వేస్తున్నావు.. ఎమ్మెల్యేకు, తనకు కూడా మామూళ్లు ఇవ్వాల్సిందేనని బెదిరింపులకు దిగారు.. అంతేకాదు.. మామూళ్లు ఇచ్చేవరకు వెంచర్ ఆపేయాల్సిందేనంటూ వార్నింగ్ ఇచ్చారు మంత్రి మల్లారెడ్డి.. సదరు మంత్రిగారు మాట్లాడినట్టు ఉన్న ఈ ఆడియో ఇప్పుడు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుండగా.. దీనిపై ఎన్టీవీతో ప్రత్యేకంగా మాట్లాడిన మల్లారెడ్డి.. నాకు డబ్బులు అడిగే అవసరం లేదని స్పష్టం చేశారు.. తనకు వందల ఎకరాల భూములు ఉన్నాయని తెలిపారు. నేను రియల్టర్‌తో మాట్లాడిన ఆడియో విషయం నాకు తెలియదన్న ఆయన.. నేను డబ్బులు డిమాండ్ చేసినట్టు ఎవరైనా స్టేట్‌మెంట్‌ ఇస్తే.. నా మంత్రి పదవికి రాజీనామా చేస్తానంటూ సవాల్ చేశారు.. ఇక, ఆడియో టేపులు ఎక్కడ నుంచి వచ్చేయో తేల్చే పనిలో ఉన్నట్టు వెల్లడించారు మంత్రి మల్లారెడ్డి.