"ఇన్వెస్ట్ ఇన్ తెలంగాణ" ను ప్రారంభించిన కేటీఆర్..!

"ఇన్వెస్ట్ ఇన్ తెలంగాణ" ను ప్రారంభించిన కేటీఆర్..!

పెట్టుబడులే లక్ష్యంగా "ఇన్వెస్ట్ ఇన్ తెలంగాణ" పేరుతో భారతీయ పరిశ్రమల సమాఖ్య ఓ భారీ వర్చువల్ సదస్సు ప్రదర్శనను గురువారం ప్రారంభించింది. ప్రభుత్వ భాగస్వామ్యంతో నేటి నుంచి నవంబర్ 24 వరకు 90 రోజుల పాటు ఈ వర్చువల్ ప్రదర్శన జరగనుంది. ఈ కార్యక్రమానికి మంత్రి కేటీఆర్ హాజరయ్యారు. ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ...తెలంగాణ రాష్ట్ర అభివృద్ధిలో కాన్ఫెడరేషన్‌ ఆఫ్‌ ఇండియన్‌ ఇండస్ట్రీ కీలకపాత్ర పోషిస్తోందని అన్నారు. కార్యక్రమంలో మొదట నిజామాబాద్ జిల్లా అభివృద్ధి ప్రణాళికను కేటీఆర్  ఆవిష్కరించారు. తెలంగాణ బిజినెస్ ఎకోసిస్టం, వనరులు, రాష్ట్రంలో ఉన్న వ్యాపార అనుకూలతల ప్రదర్శనకు ఈ సదస్సు ఎంతో దోహదపడుతుందన్నారు. రాష్ట్రంలో పెట్టుబడుల ఆకర్షణకు ఉపయోగపడుతుందని తెలిపారు. కరోనా విజృంభణతో డిజిటలైజేషన్  పరిశ్రమలకు కొత్త అవకాశాలు వచ్చాయన్నారు. ఆ అవకాశాలను తెలంగాణ రాష్ట్రం వేగంగా అందిపుచ్చుకుంటోందని ఆశాభావం వ్యక్తం చేసారు.