ఆ భూములను వెనక్కి తీసుకుంటాం : కేటీఆర్

ఆ భూములను వెనక్కి తీసుకుంటాం : కేటీఆర్

 పరిశ్రమల శాఖ, స్టేట్ ఫైనాన్స్‌ కార్పొరేషన్‌, హైదరాబాద్‌ ఫార్మా సిటీపై సంబంధిత అధికారులతో మంత్రి కేటీఆర్ మంగళవారం సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ...కంపెనీలకు ఇచ్చిన భూముల్లో నిర్ణిత గడువులోగా కార్యకలాపాలు ప్రారంభించకపోతే ఆ భూములను వెనక్కి తీసుకుంటామని హెచ్చరించారు. భూములు తీసుకుని కార్యకలాపాలు ప్రారంభించని కంపెనీలకు షోకాజ్ నోటీసులు పంపాలని ఆదేశించారు. అంతే కాకుండా స్టేట్ ఫైనాన్స్‌ కార్పొరేషన్‌పై జరిగిన సమీక్షా సమావేశంలో ఈ-స్టేట్‌ ఫైనాన్స్ కార్పొరేషన్ డిజిటల్‌ ప్లాట్‌ఫామ్‌ను ఆయన ప్రారంభించారు. కార్యక్రమంలో ఫైనాన్స్‌ కార్పొరేషన్ కార్యకలాపాల విస్తరణకు కొన్ని సూచనలు చేసారు.