ఎస్‌ఈసీ నోటీసులకు మంత్రి కొడాలి వివరణ

ఎస్‌ఈసీ నోటీసులకు మంత్రి కొడాలి వివరణ

పంచాయతీ ఎన్నికల సమయంలో మంత్రి కొడాలి నానికి నోటీసులు జారీ చేశారు ఎస్‌ఈసీ నిమ్మగడ్డ రమేష్ కుమార్.. అయితే, ఎస్ఈసీ ఇచ్చిన షోకాజ్ నోటీసుకు వివరణ ఇచ్చారు మంత్రి కొడాలి... దీనిపై ఎన్టీవీతో ప్రత్యేకంగా మాట్లాడిన కొడాలి... ఎస్ఈసీ నోటీసులో పేర్కొన్న విషయాలు అవాస్తవం... ఆ ఆరోపణలను ఖండిస్తున్నా అన్నారు.. రాజ్యాంగబద్ధ సంస్థలపై నాకు గౌరవం ఉందని వివరణలో పేర్కొన్న మంత్రి కొడాలి... ముఖ్యంగా ఎస్ఈసీ అంటే నాకు గౌరవం ఉంది... నా మాటల నిజమైన భావాన్ని ఎస్ఈసీ అర్థం చేసుకోలేదన్నారు. మొదటి విడత పంచాయతీ ఎన్నికల ఫలితాలు, టీడీపీ చేస్తున్న అరాచకాలను వివరించటానికే మీడియా సమావేశం నిర్వహించానని చెప్పుకొచ్చిన ఏపీ మంత్రి... ఉద్దేశ్యపూర్వకంగా నేను ఎస్ఈసీని కించపరిచే వ్యాఖ్యలు చేయలేదని క్లారిటీ ఇచ్చారు. తన మీద జారీ చేసిన షోకాజ్ నోటీసులను ఉపసంహరించుకోవాలని రాష్ట్ర ఎన్నికల కమిషన్‌ను విజ్ఞప్తి చేశారు మంత్రి కొడాలి నాని.