చంద్రబాబు పాలనలో ఇష్టం వచ్చినట్లు రాష్ట్రాన్ని దోచుకున్నారు..

చంద్రబాబు పాలనలో ఇష్టం వచ్చినట్లు రాష్ట్రాన్ని దోచుకున్నారు..

టీడీపీ అధినేత నారా చంద్రబాబుపై ఏపీ మంత్రి కొడాలి నాని మరో సారి ఫైర్‌ అయ్యారు. చంద్రబాబును విమర్శించడంలో ఎప్పుడు ముందు వరుసలో ఉండే కొడాలి ..ఇవాళ మీడియా సమావేశంలోనూ విరుచుకుపడ్డారు. గత ముఖ్యమంత్రి చంద్రబాబు కొన్ని మీడియాలతో కుమ్మకై సొంత డబ్బా కొట్టుకున్నారని మండి పడ్డారు.  చంద్రబాబు పాలనలో ఇష్టం వచ్చినట్లు రాష్ట్రాన్ని దోచుకున్నారని విమర్శించాడు. వైస్‌ జగన్‌ ముఖ్యమంత్రిగా ఉండటం కొంతమందికి ఇబ్బందిగా ఉందని పేర్కొన్నారు. కొందరు కావాలనే ఛానళ్లలో సీఎం జగన్‌ పై అసత్య ప్రచారాలు చేపిస్తున్నారని ఫైర్‌ అయ్యారు. సీఎం జగన్‌ను ముఖ్యమంత్రి పదవి నుంచి దించేందుకు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి వంటి ఎమ్మెల్యేల మద్దతు కూడగట్టారని అసత్య ప్రచారం మొదలు పెట్టారని ఆగ్రహం వ్యక్తం చేశారు. చంద్రబాబు లాంటి వెన్నుపోటు రాజకీయాలు వైసీపీ పార్టీలో జరగవని స్పష్టం చేశారు. సీఎం వైఎస్‌ ఎంతో కష్టపడితే.. ప్రభుత్వం ఏర్పడిందని స్పష్టం చేశారు. ఆయనను సీఎం నుంచి దించేస్తే ఏపీ ప్రజలు చూస్తూ ఊరుకోరన్నారు. ఎన్టీఆర్‌ను వెన్నుపోటు పొడిచి చంద్రబాబు సీఎం అయిన తర్వాత రాష్ట్రంలో ఏం జరిగిందో ప్రజలకు తెలుసునని గుర్తుచేశారు.  ఇకనైనా చంద్రబాబు బుద్ది మార్చుకోవాలని హితవు పలికారు.