కొడాలి తగ్గరుగా..! ఎస్‌ఈసీపై మరోసారి సంచలన వ్యాఖ్యలు

కొడాలి తగ్గరుగా..! ఎస్‌ఈసీపై మరోసారి సంచలన వ్యాఖ్యలు

ఎస్‌ఈసీ నిమ్మగడ్డ రమేష్‌ కుమార్‌ షోకాజ్ నోటీసులపై స్పందిస్తూ మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు ఆంధ్రప్రదేశ్‌ మంత్రి కొడాలి నాని.. ఎన్టీవీతో ప్రత్యేకంగా మాట్లాడిన ఆయన.. నా నోరు నొక్కితే మరొకరు మాట్లాడతారు అన్నారు. ఎర్రగడ్డ ఆస్పత్రిలో చికిత్స చేయించుకోమని సలహా ఇవ్వటం తప్పెలా అవుతుంది? అని ప్రశ్నించిన మంత్రి... సలహా పాటించాలా..? వద్దా..? అన్నది వాళ్ల ఇష్టమే అన్నారు. మీడియా సమావేశంలో ప్రభుత్వ పథకాలపై మాట్లాడిన తర్వాత.. మీడియా ప్రతినిధులు అడిగిన ప్రశ్నలకు సమాధానాలు చెప్పాను.. ప్రభుత్వాన్ని కొందరు ఇబ్బంది పడుతున్నారు.. వారిని అడ్డుకోవడంలో ఎస్‌ఈసీ విఫలం అయ్యింది, ఎస్‌ఈసీ పద్ధతి మార్చుకోవాలని తాను వ్యాఖ్యానించినట్టు తెలిపారు.

ఇక, ప్రజలు మీ మానసిక పరిస్థితి బాగలేదని భావిస్తున్నారు.. అందుకే ఎర్రగడ్డ ఆస్పత్రిలో చేరాలని సలహా ఇచ్చాను అన్నారు కొడాలి నాని.. సలహా ఇస్తే కూడా జైలులో పెడతారా? అని ప్రశ్నించారు. నా వివరణ పై సంతృప్తి చెందకపోతే... ఉరి వేస్తారా? అంటూ ఘాటుగా స్పందించారు. ఎన్నికలు నిష్పక్షపాతంగా నిర్వహిస్తున్నాం అని భరోసా కల్పించాల్సిన బాధ్యత ఎస్ఈసీదేనని స్పష్టం చేసిన నాని..  చంద్రబాబు ఎలాంటి వ్యాఖ్యలు చేసిన నిమ్మగడ్డ ఎందుకు చర్యలు తీసుకోవటం లేదు? అని ఫైర్ అయ్యారు.. ఇక, ఎస్‌ఈసీపై ప్రివిలేజ్ కమిటీకి ఫిర్యాదు చేసే ఆలోచన తనకు లేదన్నారు మంత్రి కొడాలి.. ఎస్‌ఈసీ షోకాజ్ నోటీసు ఉపసంహరించుకుంటారు అని భావిస్తున్నానన్న ఆయన... లేకపోతే నాకు ఉరి వేస్తారా? నా తలను తీసి ఎన్నికల కమిషన్‌ ఆఫీసుకు గుమ్మడి కాయలా కట్టేస్తారా ఏంటి ? అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు.