కార్యక్రమాలన్నీ రద్దు..! ఉన్నఫలంగా సీఎం దగ్గరకు మంత్రి కొడాలి..!

కార్యక్రమాలన్నీ రద్దు..! ఉన్నఫలంగా సీఎం దగ్గరకు మంత్రి కొడాలి..!

ఉన్నట్టుండి గుడివాడ పాలిటిక్స్ హీటెక్కాయి... జనసేన అధినేత  పవన్ కల్యాణ్ ఇటీవలే గుడివాడలో భారీ బహిరంగ సబలో మాట్లాడుతూ పేకాట క్లబ్‌లపై ధ్వజమెత్తారు.. మీరు పేకాట క్లబ్‌లు, సిమెంట్ కంపెనీలు, మీడియా సంస్థలను నడపగాలేంది.. నేను సినిమాల్లో నటిస్తే తప్పేంటి అంటూ కామెంట్లు చేసి కాకరేపారు.. ఇక, అక్కడి నుంచి పవన్ కల్యాణ్‌పై ఎదురుదాడికి దిగారు మంత్రి కొడాలి నాని.. రాజకీయ విమర్శలతో పాటు.. వ్యక్తిగత ఆరోపణల వరకు పోయింది వ్యవహారం.. ఇదే సమయంలో.. గత రాత్రి గుడివాడ నియోజకవర్గంలోని తమ్మిరిస గ్రామంలో పేకాట శిబిరంపై ఎస్ఈబీ దాడులు చేయడం.. భారీగా వాహనాలు, నగదు సీజ్ చేశారు.. అధికార పార్టీ నేతలే పేకాట క్లబ్ ను నడుపుతున్నారనే ఆరోపణలు వినిపిస్తుండడంతో.. ఈ వ్యవహారం చర్చగా మారింది... ఎస్‌ఈబీ జరిపిన దాడుల్లో 30 మంది పేకాట రాయుళ్లను పట్టుకుంది. 28 కార్లు, కోట్ల కొద్దీ నగదు స్వాధీనం చేసుకున్నట్టు తెలుస్తోంది. అయితే, ఇది ఎలా ఉన్నా.. ఉన్నఫలంగా సీఎం వైఎస్ జగన్‌ దగ్గరకు చేరుకున్నారు మంత్రి కొడాలి నాని.. గుడివాడలో ఇవాళ ఉదయం కార్యక్రమాలన్నీ రద్దు చేసుకుని తాడేపల్లిలో సీఎం నివాసానికి హడావుడిగా వచ్చారట మంత్రి కొడాలి నాని.. జనసేన అధినేత పవన్ కల్యాణ్ చేసిన వ్యాఖ్యలు సంచలనంగా మారగా.. తాజా పరిణామాలతో హడావుడిగా మంత్రి కొడాలి నాని.. సీఎం వైఎస్‌ జగన్‌ను కలవడం ప్రాధాన్యత సంతరించుకుంది.