బాబుపై కొడాలి నాని తీవ్ర విమర్శలు... 

బాబుపై కొడాలి నాని తీవ్ర విమర్శలు... 

ఏపీ అసెంబ్లీలో సంక్షేమ పథకాలపై చర్చ జరిగే సమయంలో పెన్షన్ రూ.3 వేలు ఇస్తామన్నారు ఏమైందని తెలుగుదేశం పార్టీ ప్రశ్నించింది.  దీనిపై మంత్రి కొడాలి నాని స్పందించారు.  టీడీపీ హయాంలో మీరు ఎంత ఇచ్చారో చెప్పాలని నిలదీశారు.  చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఉన్న 9 ఏళ్ల కాలంలో పెన్షన్ లో ఒక్కరూపాయి కూడా పెంచలేదని అన్నారు.  తమ వైసీపీ ప్రభుత్వం ప్రతినెలా 1 వ తేదీన పెన్షన్ ఇస్తోందని అన్నారు.  ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడు అనేక మార్పు పారిపోయారని, 1983లో ఓడిపోగానే కాంగ్రెస్ ను వదిలి పారిపోయారని,  అప్పుడు చంద్రగిరి నుంచి కుప్పం పారిపోయారని, ఓటుకు నోటు కేసులో హైదరాబాద్ వదిలి పారిపోయారని, కరోనా రాగానే కాల్వగట్టు వదిలి హైదరాబాద్ కు పారిపోయారని అన్నారు.  చంద్రబాబు నాయుడు ఫేక్ ప్రతిపక్ష నేత అని, ఫేక్ తెలుగుదేశం పార్టీ అని నాని తీవ్రంగా విమర్శలు చేశారు.