బాబు, లోకేష్ సర్పంచ్, వార్డుమెంబర్‌గా కూడా గెలవరు..!

బాబు, లోకేష్ సర్పంచ్, వార్డుమెంబర్‌గా కూడా గెలవరు..!

మరోసారి టీడీపీ అధినేత చంద్రబాబు, ఆయన కుమారుడు నారా లోకేష్‌ను టార్గెట్ చేశారు మంత్రి కొడాలి నాని.. ఏపీలో పంచాయతీ ఎన్నికల ఫలితాలపై ఎన్టీవీతో ప్రత్యేకంగా మాట్లాడిన ఆయన.. చంద్రబాబు, లోకేష్ సర్పంచ్, వార్డుమెంబర్‌గా కూడా గెలవరు అని జోస్యం చెప్పారు. చంద్రగిరిలో ప్రజలు ఓడించటంతోనే చంద్రబాబు.. కుప్పంకు వలస వెళ్లారని విమర్శించిన ఆయన.. ఇప్పుడు కుప్పం వదిలి మరో నియోజకవర్గం వెతుక్కుంటారు అంటూ ఎద్దేవా చేశారు.. ప్రజలను గాలికి వదిలేయటంతోనే పంచాయతీ ఎన్నికల్లో టీడీపీకి ఈ ఫలితాలు వచ్చాయని వ్యాఖ్యానించారు కొడాలి నాని. 

మరోవైపు.. మీడియాతో మాట్లాడవచ్చని కోర్టు మధ్యంతర ఉత్తర్వులు ఇచ్చిందన్నారు కొడాలి నాని.. తుది తీర్పు కూడా నాకు అనుకూలంగా వస్తుందని అనుకుంటున్నానన్న ఆయన.. తిరుపతిలో బియ్యం పంపిణీ వాహనంలో తిరుపతి లడ్డూల పంపిణీపై సమాచారం తెప్పించుకున్నాను.. వాహనం పొందిన లబ్దిదారుడు తనకు కేటాయించిన ఆ 50 ఇళ్లకు వ్యక్తిగతంగా లడ్డూలు పంపిణీ చేసినట్లు తెలిసిందన్నారు.. దీనిపై పూర్తిస్థాయిలో విచారణ చేయాలని ఆదేశించినట్టు వెల్లడించారు. తిరుపతి లడ్డూలు పంపిణీ చేస్తే ఎన్నికల్లో గెలిచేస్తారా? అని ప్రశ్నించారు మంత్రి కొడాలి.