చంద్రబాబు నోటిని దానితో కడగాలి : కొడాలి నాని

చంద్రబాబు నోటిని దానితో కడగాలి : కొడాలి నాని

అసెంబ్లీ అంటే టీడీపీ ఆఫీసా..?అసెంబ్లీ ఎందుకు ఆలస్యంగా ప్రారంభమైందో స్పీకరును అడగాలి.. సీఎంను అడిగితే ఏం లాభం అని మంత్రి కొడాలి నాని అన్నారు. పరిటాల రవి.. ఎన్టీఆర్ చావుకు కారణం చంద్రబాబు కాదా..? చంద్రబాబు సీఎంగా ఉన్నప్పుడు రామానాయుడు స్టూడియోస్ దగ్గర బాంబ్ బ్లాస్టుకు కారణం చంద్రబాబేనా.. టీడీపీ గాలి పార్టీ.. చంద్రబాబు గాలి మనిషి అని అన్నారు. మాట్లాడేందుకు సమయం ఇవ్వలేదనే సభలో భైఠాయించారు. చంద్రబాబు ఓ బ్రోకర్.. బ్రోకరును సస్పెండ్ చేసి రైతులను కాపాడుతున్నాం. చంద్రబాబు నోటిని పెనాయిలుతో కడగాలి. రైతులు పండించే పంటలను దోచుకునే దళారీ చంద్రబాబు. గెదేలు పెంచారా..? బర్రెలు పెంచారా..? కూరగాయలు పండించారా..? హెరిటేజ్లో అవే అమ్ముతున్నారు అని పేర్కొన్నారు. పోలవరం ఎత్తును పప్పు.. పప్పు తాత లవంగం నాయుడు వెళ్లి కొలిచారా.. మేమూ ప్రజల కోసమే చంద్రబాబు అనే మాటలను పడుతున్నాం. గాలికి కొట్టుకొచ్చి ఎన్టీఆర్ అల్లుడై చంద్రబాబు సీఎం అయ్యారు అని కొడాలి తెలిపారు.