పవన్‌పై కొడాలి నాని కౌంటర్ ఎటాక్..

పవన్‌పై కొడాలి నాని కౌంటర్ ఎటాక్..

జనసేన అధినేత పవన్ కల్యాణ్‌ తాజాగా చేసిన కామెంట్లకు ఘాటుగా కౌంటర్ ఇచ్చారు మంత్రి కొడాలి నాని.. గుడ్లవల్లేరు మండలం కౌతవరం గ్రామంలో జరిగిన పేదలందరికీ ఇల్లు పంపిణీ కార్యక్రమంలో ఉప ముఖ్యమంత్రి ధర్మాన కృష్ణదాస్‌తో కలిసిన పాల్గొన్న కొడాలి నాని... అక్కడి నిర్వహించిన సభలో మాట్లాడుతూ.. పవన్ పై తీవ్రస్థాయిలో ఫైర్ అయ్యారు.. పేర్ని నానిని, నన్ను బోడి లింగాలు అంటూ కామెంట్ చేసిన పవన్‌ కల్యాణే పెద్ద పెద్ద బోడి లింగం అంటూ కౌంటర్ ఎటాక్ చేశారు.. తామిద్దరం శివలింగాలం కాబట్టే మచిలీపట్నం, గుడివాడ ప్రజలు తమను నెత్తిమీద పెట్టుకున్నారన్న ఆయన.. పవన్ కల్యాణ్ ఒక పెద్ద బోడిలింగం కాబట్టే  గాజువాక, భీమవరం ప్రజలు కింద పడేసి తొక్కేశారంటూ సెటైర్లు వేశారు. 

ప్యాకేజీలు తీసుకొని, ఎవరో రాసిన స్క్రిప్టులు చదివే పచ్చకామెర్లు సోకిన యాక్టర్‌ను ప్రజలు నమ్మరంటూ పవన్‌పై ఘాటు విమర్శలు చేశారు కొడాలి నాని.. ప్రజల తిరస్కారానికి గురైన పవన్ కల్యాణ్‌.. సిగ్గు శరం లేకుండా మాట్లాడటం అతని అవివేకానికి నిదర్శనమన్న ఆయన.. పవన్ లాంటి వ్యక్తులు రాజకీయాల్లో ఉండటం మన దురదృష్టం అంటూ ఎద్దేవా చేశారు.. గజదొంగ లాంటి చంద్రబాబు, బోడి లింగం లాంటి పవన్ కల్యాణ్‌లు ఎంతమంది వచ్చినా, దేవుడు ఆశీస్సులు ఉన్నంత కాలం సీఎం వైఎస్ జగన్ బొచ్చు కూడా పీలకలేరు అంటూ హాట్ కామెంట్లు చేశారు. కాగా, కృష్ణా జిల్లాలో తన పర్యటన సందర్భంగా ఇద్దరు మంత్రులను టార్గెట్ చేస్తూ పవన్ కల్యాణ్ విమర్శలు చేసిన సంగతి తెలిసిందే.. ఇప్పుడు పవన్ కల్యాణ్, మంత్రుల కామెంట్లు ఏపీ పాలిటిక్స్‌ను మరోసారి హీటెక్కిస్తున్నాయి.