చంద్రబాబు పై కొడాలి నాని మరోసారి ఫైర్...

చంద్రబాబు పై కొడాలి నాని మరోసారి ఫైర్...

టీడీపీ అధినేత చంద్రబాబుపై మంత్రి కొడాలి నాని మరోసారి ఫైర్ అయ్యారు. రాజధాని వ్యవహారంలో బాబు అండ్‌ కో బాగుపడ్డారని నాని అన్నారు. అమరావతిలో రాజధాని వస్తుందని టీడీపీ నేతలకు ముందే తెలుసునని చెప్పారు. భూములు కొనుగోలు చేసుకోవాలని టీడీపీ నేతలకు చంద్రబాబు ముందే చెప్పారని ఆరోపించారు. రాజధానిలో రైతులను మోసం చేసి ఎకరం రూ.25లక్షలకు కొనుగోలు చేశారని మంత్రి కొడాలి నాని ఆగ్రహం వ్యక్త చేశారు. టీడీపీ నేతలు రియల్‌ ఎస్టేట్ వ్యాపారం చేసి కోట్లు గడించారని విమర్శించారు. మేం ప్రతిపక్షంలో ఉన్నప్పటి నుంచీ భూ కుంభకోణం జరిగిందని చెప్తున్నాం....  అధికారంలోకి వచ్చిన తర్వాత సీఎం‌ జగన్‌ కుంభకోణంపై కేబినెట్ సబ్‌ కమిటీ, సిట్‌ నియమించారని పేర్కొన్నారు. గత మార్చిలోనే అమరావతి రాజధాని భూ కుంభకోణంపై.. సీబీఐ విచారణకు ఆదేశించాలని కేబినెట్ ఆమోదంతో కేంద్రాన్ని కోరామని తెలిపారు. చంద్రబాబు అవినీతి చేసి డబ్బు ఎలా సంపాదించాలో తెలిసిన మాస్టర్... ఆయన ఎన్ని స్టేలు తెచ్చుకున్నారో ప్రజలందరికీ తెలుసునని చెప్పారు.