జేడీయూకి షాక్: నాలుగు రోజుల్లో ఇద్దరు మంత్రులు మృతి 

జేడీయూకి షాక్: నాలుగు రోజుల్లో ఇద్దరు మంత్రులు మృతి 

బీహార్ లో కరోనా విజృంభిస్తోంది.  కేసులు భారీగా పెరుగుతున్నాయి.  సామాన్యుల నుంచి రాజకీయ నాయకుల వరకు ఎవర్ని కరోనా వదలడం లేదు.  ఇప్పటికే అనేకమంది బీహార్ నేతలు కరోనా బారిన పడ్డారు.  మంత్రులకు సైతం కరోనా సోకుతున్నది.  గత నాలుగు రోజుల క్రితం బీహార్ మంత్రి వినోద్ కుమార్ సిన్హా కరోనాతో మృతి చెందిన సంగతి తెలిసిందే.  నాలుగు రోజుల వ్యవధిలో బీహార్ కు చెందిన మరో మంత్రి కరోనాతో మృతి చెందారు.  నితీష్ కుమార్ ప్రభుత్వంలో పంజాయితీరాజ్ మంత్రిగా చేస్తున్న కపిల్ దేవ్ కామత్ కరోనాతో పాట్నాలోని ఎయిమ్స్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మరణించారు.  అక్టోబర్ 1 వ తేదీన కరోనా సోకడంతో పాట్నాలోని ఎయిమ్స్ లో జాయిన్ అయ్యారు.  అక్కడే చికిత్స పొందుతున్న మంత్రి కపిల్ దేవ్ కామత్ శరీరంలోని కీలక అవయవాలకు కరోనా సోకడంతో మృతి చెందినట్టు వైద్యులు తెలిపారు.