మంత్రి వెలంపల్లిని కొట్టారు.. కాలితో తన్నారు..!

మంత్రి వెలంపల్లిని కొట్టారు.. కాలితో తన్నారు..!

శాస‌న‌మండ‌లిలో జ‌రిగిన ప‌రిణామాలు అధికార‌, ప్ర‌తిప‌క్షం మ‌ధ్య మాట‌ల యుద్ధానికి తెర‌లేపాయి.. ఆ ప‌రిణామాల‌పై స్పందించిన మంత్రి కన్నబాబు... బిల్లులను అడ్డుకుంటామని ముందు నుంచి చెప్పినట్టుగానే టీడీపీ అడ్డుకుంద‌ని విమ‌ర్శించారు.. ద్రవ్య వినిమయ బిల్లును అడ్డుకుంది.. అప్రాప్రియేషన్ బిల్లును అడ్డుకున్న చరిత్రను మూటగట్టుకుంది అని మండిప‌డ్డారు.. శాసన మండలిలో ఫొటోలు తీయొద్దని డిప్యూటీ ఛైర్మన్ చెప్పినా .. లోకేష్ వినలేద‌న్న ఆయ‌న‌.. మంత్రి వెలంపల్లిని టీడీపీ ఎమ్మెల్సీలు కొట్టారు.. కాలితో త‌న్నార‌ని ఆరోపించారు.. బిల్లులను అడ్డుకున్న టీడీపీ.. జీతాలు ఇవ్వకుండా చేయగలిగింద‌ని ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు క‌న్న‌బాబు.. అమరావతి ప్రేమికుల కోసమే టీడీపీ పని చేస్తుందే తప్ప.. ప్రజల కోసం కాద‌న్న ఆయ‌న‌.. చైర్‌లో ఉన్న రెడ్డి సుబ్ర‌మ‌ణ్యం.. మా వాళ్లు అంటూ టీడీపీని ఓన్ చేసుకుంటే. మేమేం చెప్పగలం..? అని వ్యాఖ్యానించారు. మంత్రులను బయటకు పంపమని ఓ సభ్యుడు చెబుతారు... అచ్చెన్నాయుడును అరెస్ట్ చేస్తే అన్నా హజారేని అరెస్ట్ చేసినట్టు బిల్డప్ ఇస్తారంటూ ఎద్దేవా చేసిన క‌న్న‌బాబు.. దీక్ష చేస్తున్న ముద్రగడ పద్మనాభంను 3 వేల మంది పోలీసులు లాక్కెళ్లిన విషయం గుర్తుకు రాదా..? అని ప్ర‌శ్నించారు.. ఇక‌, మండలిలో జరిగిన ఘటనలపై చంద్రబాబు కనీసం బాధ కూడా వ్యక్తం చేయలేదు అని మండిప‌డ్డ మంత్రి క‌న్న‌బాబు.. లోకేష్ తీసిన వీడియోలు.. ఫొటోలు బయట పెట్టాల‌ని డిమాండ్ చేశారు.