రథం దగ్దమైతే బాబు ఆనంద తాండవం చేస్తున్నారు..

రథం దగ్దమైతే బాబు ఆనంద తాండవం చేస్తున్నారు..

రైతుల కష్టాలు పడకుండా చూడడమే ప్రభుత్వ లక్ష్యమని ఏపీ మంత్రి కన్నబాబు అన్నారు. ఆయిల్ పామ్ ధరల్లో తెలంగాణతో ఉన్న వ్యత్యాసాన్ని తగ్గించేందుకు రూ. 80 కోట్లు కేటాయించామని పేర్కొన్నారు.  ఆయిల్ పామ్ పంట కొనుగోళ్లను టన్నుకు రూ. 11 వేలు ఇవ్వాలని నిర్ణయించామన్నారు.  ఆయిల్ పామ్ కు మద్దతు ధర ప్రకటించాలని కేంద్రాన్ని కోరామని  పేర్కొన్నారు. మార్కెటింగ్ వ్యవస్థను రైతులకు మరింత చేరువయ్యేలా చర్యలు తీసుకుంటున్నామని... వివిధ వాణిజ్య పంటలను ప్రాసెసింగ్ చేయడం ద్వారా రైతులకు మరింత లబ్ది చేకూర్చేందుకు నిర్ణయం తీసుకున్నామని తెలిపారు. త్వరలో ఆహార శుద్ధి పాలసీని ప్రకటిస్తామని... వ్యవసాయ.. వ్యవసాయ అనుబంధ రంగాలను ఫుడ్ ప్రాసెసింగ్ పాలసీలోకి తెస్తామని ప్రకటించారు.  

రథం దగ్దమైతే చంద్రబాబు ఆనంద తాండవం చేస్తున్నారని ఫైర్‌ అయ్యారు. భక్తి శ్రద్ధలతో జగన్ పట్టు వస్త్రాలు సమర్పిస్తే ఆరోపణలు చేయడం కరెక్ట్ కాదన్నారు. గతంలో కులాలను అడ్డం పెట్టి రాజకీయం చేసిన చంద్రబాబు.. ఇప్పుడు మతాన్ని అడ్డం పెట్టే ప్రయత్నం చేస్తున్నారని మండిపడ్డారు. చంద్రబాబు ఎన్నో గుళ్లను జేసీబీలతో కూలగొట్టించారని గుర్తుచేశారు. సీఎం జగన్ ఢిల్లీ టూర్ విషయమై టీడీపీ అనుమానాలకు సమాధానం చెప్పాల్సిన అవసరం తమకు లేదన్నారు.  ప్రజలకే జవాబుదారీగా ఉంటామని..తానింకా ప్రభుత్వాన్నే నడుపుతున్నానని చంద్రబాబు భావిస్తున్నారని ఎద్దేవా చేశారు.