ఉచిత విద్యుత్ పథకం వైఎస్సార్ మానస పుత్రిక..!

ఉచిత విద్యుత్ పథకం వైఎస్సార్ మానస పుత్రిక..!

టీడీపీ అధినేత చంద్రబాబు పై మంత్రి కన్నబాబు మండిపడ్డారు. చంద్రబాబుకు ఉచిత విద్యుత్ అనే పదం ఉపయోగించే హక్కు కూడా లేదన్నారు. బషీర్ బాగ్ కాల్పుల సంఘటన మరిచిపోయారా? అని ప్రశ్నించారు. "మనసులో మాట" పుస్తకంలో వ్యవసాయం గురించి, రైతుల గురించి తను రాసిన మాటలను తనే ఓ సారి చదువుకుంటే మంచిదని అన్నారు. తన హయాంలో వందలాది మంది రైతులను కరెంటు బిల్లులు కట్టలేదని జైలుకు పంపిన చరిత్ర చంద్రబాబుదని అన్నారు. వ్యవసాయ రంగం పై చర్చ కు సిద్ధమని, మీకు నచ్చిన ఎవర్నైనా పంపండి అంటూ సవాల్ విసిరారు. ఉచిత విద్యుత్ పథకం వైఎస్సార్ మానస పుత్రిక... అటువంటి పథకాన్ని మేం ఎందుకు ఎత్తేస్తాం ? అని ప్రశ్నించారు. చంద్రబాబు నోటికి వచ్చింది మాట్లాడి తన స్థాయి తనే తగ్గించుకుంటున్నారని అన్నారు.