కాంగ్రెస్ వల్లే తెలంగాణ అధోగతి... 

కాంగ్రెస్ వల్లే తెలంగాణ అధోగతి... 

నాగార్జున సాగర్ ఉప ఎన్నిక, గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల సన్నాహక సమావేశాన్ని ఈరోజు నాగార్జున సాగర్ లో నిర్వహించారు.  ఈ సన్నాహక సమావేశానికి మంత్రి జగదీశ్ రెడ్డి హాజరయ్యారు.  ఈ సమావేశంలో రాజ్యసభ ఎంపీ లింగయ్య యాదవ్, మాజీ ఎమ్మెల్సీ కర్న్ ప్రభాకర్, ఎమ్మెల్సీ చిన్నపరెడ్డి, ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.  ఈ సందర్భంగా మంత్రి జగదీశ్ రెడ్డి కొన్ని కీలక వ్యాఖ్యలు చేశారు.  బీజేపీ, కాంగ్రెస్ నేతలు కేసీఆర్ కాలిగోటికి సరిపోరని, కేసీఆర్ పై అవాకులు, చవాకులు పేలితే మర్యాదగా ఉండదని అన్నారు.  60 ఏళ్ళు పాలించిన కాంగ్రెస్ పార్టీ వల్లే తెలంగాణ అధోగతి పాలైందని మంత్రి జగదీశ్ రెడ్డి పేర్కొన్నారు.  నల్లగొండ జిల్లాలో ఫ్లోరైడ్ భూతాన్ని పెంచి, ప్రజలను నరకయాతన పెట్టిన జానారెడ్డి, ఉత్తమ్, కోమటిరెడ్డిలకు అభివృద్ధి గురించి మాట్లాడే అర్హత లేదని మంత్రి జగదీశ్ రెడ్డి పేర్కొన్నారు.  తెరాస పార్టీ ఆరేళ్ళ పాలనలో ఇంటింటికి కృష్ణా జలాలను అందించి ఫ్లోరైడ్ భూతాన్ని తరిమికొట్టిన ఘనత కేసీఆర్ దే అని మంత్రి జగదీశ్ రెడ్డి పేర్కొన్నారు.   ఉమ్మడి నల్గొండలో మూడు మెడికల్ కాలేజీలు, యాదాద్రిలో పవర్ ప్లాంట్, దుండు మల్కాపూర్ ఇండస్ట్రియల్ పార్క్, యాదాద్రి ఆలయ పునర్నిర్మాణం చేసి కేసీఆర్ చరిత్రలో నిలిచిపోయారని అన్నారు.