ఉత్తమ్ కు దుబ్బాక ఎలా ఉంటదో తెలియదు..ఓట్ల కోసమే వస్తున్నారు

ఉత్తమ్ కు దుబ్బాక ఎలా ఉంటదో తెలియదు..ఓట్ల కోసమే వస్తున్నారు

దుబ్బాక ఆర్యవైశ్య భవన్ లో ఆర్య వైశ్య సంఘం ప్రతినిధులతో అలాయ్ - బలాయ్ కార్యక్రమంలో  మంత్రి హరీష్ రావు, నిజామాబాద్ అర్బన్ ఎమ్మెల్యే గణేష్  పాల్గొన్నారు. ఈ మంత్రి హరీశ్ రావు కాంగ్రెస్, బీజేపీ పార్టీలపై విమర్శలు చేశారు.  దుబ్బాకకు ఇప్పుడు వచ్చే వారు కేవలం ఓట్ల కోసమే వస్తున్నారని..ఉత్తమ్ కు దుబ్బాక ఎలా ఉంటదో తెలియదు... మంత్రిగా ఉన్నప్పుడు ఒక్క సారి దుబ్బాక కు రాలేదని ఫైర్ అయ్యారు. హుజూర్ నగర్ లో టీ ఆర్ ఎస్ గెలిచాక.... కేసీఆర్ ఆ నియోజకవర్గానికి వెళ్లి 300 కోట్ల పనులు  మంజూరు చేశారని... రేపు దుబ్బాకకు అదే రీతిలో అభివృద్ధి పనులు వస్తాయన్నారు. దుబ్బాక అభివృద్ధి బాధ్యత హరీశ్ రావుదేనని.. అనుమానం అవసరం లేదని హామీ ఇచ్చారు. నేను  జిల్లా మంత్రిని... కేసీఆర్ ఆశీస్సులతో దుబ్బాకను అభివృద్ధి చేస్తా అని హరీశ్ రావు చెప్పారు. నారాయణ ఖేడ్ ను నేను సీఎం ఆశీస్సులతో అలాగే అభివృద్ధిచేసానని... 200 వందల కోట్లక పైగా ఖర్చు పెట్టి రోడ్లు వేయించానన్నారు. ఎన్నికల వరకే కాంగ్రెస్, బీజేపీ నేతలు  ఉంటారని...  ఆ తర్వాత కూడా నేను ఉంటానని తెలిపారు. ఓసీ పేదలకు సహాయం అందుతుందంటే అదీ తెలంగాణ రాష్ట్రంలోనే... దేశంలో ఈ విధానం ఎక్కడా లేదని పేర్కొన్నారు.