కాంగ్రెస్, బిజెపి ఎండమావులు లాంటివి..

 కాంగ్రెస్, బిజెపి ఎండమావులు లాంటివి..

దుబ్బాక ఉప ఎన్నికల్లో భాగంగా టిఆర్ఎస్ అభ్యర్థి సోలిపేట సుజాత తో కలిసి దౌల్తాబాద్ మండలం ముబారస్ పూర్, హైమద్ నగర్ , తిరుమలాపూర్ ప్రచారంలో మంత్రి హరీశ్ రావు పాల్గొన్నారు. ఈ సందర్బంగా మంత్రి హరీశ్ రావు కాంగ్రెస్, బీజేపీలపై విరుచుకుపడ్డారు.  దుబ్బాక నియోజకవర్గ తొలి మహిళ ఎమ్మెల్యే సోలిపేట సుజాత ఇందులో అలాంటి అనుమానం లేదన్నారు. కాంగ్రెస్ నాయకుల చేతుల్లో ఢిల్లీలో, గల్లిలో ఏమీలేదని.. 70 ఏళ్ల పాలనలో కాంగ్రెస్, తెదేపా కనీసం తాగునీటి సమస్య కూడా తీర్చలేదని ఫైర్ అయ్యారు. దేశంలో, కాంగ్రెస్, భాజపా పాలిత రాష్ట్రంలో ఎక్కడ కూడా బీడీల పెన్షన్లు ఇవ్వడం లేదని...కాంగ్రెస్ కు ఓటు వేస్తే మళ్లా దొంగ రాత్రి కరెంట్ వస్తదని తెలిపారు. కాంగ్రెస్ ఉన్నపుడు కరెంట్ ఇవ్వక రైతులను ఇబ్బందులు పెడితే... నేడు భాజపా మీటర్లు పెట్టి ఇబ్బందులు పెట్టాలని చూస్తుందని ఫైర్ అయ్యారు.  

కరోనా కష్టకాలంలో కూడా ప్రభుత్వం సంక్షేమ పథకాలను ఆపకుండా అమలు చేసిన ఘనత కేసీఆర్ కే దక్కుతుందన్నారు. వానాకాలం ఉసిల్లు వచ్చినట్లు ఓట్లు వచ్చినపుడు కాంగ్రెస్, భాజపా నాయకులు వచ్చి పోతారని..ప్రజలకు అందుబాటులో ఉంది సేవ చేస్తోంది టీఆర్ఎస్ పార్టీ మాత్రమేనని పేర్కొన్నారు.  సమైఖ్య రాష్ట్రంలో అప్పటి ప్రభుత్వలు భూమి సిస్సు వసూలు చేస్తే నేడు రైతుకు పెట్టుబడి సాయం చేసున్న ప్రభుత్వం తెరసనేనని తెలిపారు. కాంగ్రెస్, భాజపా ఎండమావులు లాంటివి.. వారి వెంటపొతే ఏమి రాదన్నారు.  ప్రజా సంక్షేమ పథకాలను అమలు చేసున్న టీఆర్ఎస్ కే ఈ ఉప ఎన్నికల్లో ప్రజలంతా ఓటు వేసి గెలిపంచాలని కోరారు.