రామలింగారెడ్డి మరణం పట్ల మంత్రి హరీశ్‌రావు దిగ్భ్రాంతి

రామలింగారెడ్డి మరణం పట్ల  మంత్రి హరీశ్‌రావు దిగ్భ్రాంతి

దుబ్బాక ఎమ్మెల్యే రామలింగారెడ్డి అకాల మరణంతో తీవ్ర దిగ్భ్రాంతికి లోనయ్యానని మంత్రి హరీశ్ రావు ‌ అన్నారు. ఆయన మరణం ఉమ్మడి మెదక్‌ జిల్లాకు, నాకు వ్యక్తిగతంగా తీరని లోటని ట్వీట్‌ చేశారు. ఉద్యమ సహచరుడిగా, తోటి ప్రజా ప్రతినిధిగా ఆయనతో ఎన్నో ఏళ్ల అనుబంధం ఉందని గుర్తు చేసుకున్నారు. దుబ్బాక నియోజకవర్గ అభివృద్ధికి, ప్రజలకోసం పరితపించిన నాయకుడని కొనియాడారు. తెలంగాణ ఉద్యమంలో జర్నలిస్టుగా, ఉద్యమకారుడిగా కీలకపోత్ర పోషించారన్నారు. లింగన్న అని ఆత్మీయంగా పిలుచుకునే మంచి మనిషిని కోల్పోవడం దురదృష్టకరమన్నారు. అకాల మరణానికి సంతాపం తెలుపుతూ, కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి ప్రకటించారు.