అందుకే కాంగ్రెస్ నాయకులకు కడుపు మంట

అందుకే కాంగ్రెస్ నాయకులకు కడుపు మంట

తెలంగాణ జనం సీఎం కేసీఆర్ వెంట ఉన్నారని.. కాంగ్రెస్ నాయకులకు కడుపు మండుతుందని టీఆర్ఎస్ నేత హరీష్‌రావు విమర్శించారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా సోమవారం ఆయన మహబూబాబాద్ జిల్లా తోర్రుర్ లోని టిఆర్ఎస్ పార్టీ నిర్వహించిన ప్రజా ఆశీర్వాద సభలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... దయాకర్ రావు టీడీపీ నుండి టీఆర్ఎస్ పార్టీ లోకి వచ్చినప్పుడు పదవులు అడగలేదు, సాగునీరు కావాలని అడిగారని తెలిపారు. ఎన్నికల తర్వాత చిన్నవంగర, మటెడు చెరువులను రిజర్వాయర్ లుగా మారుస్తామని ఆయన హామీ  ఇచ్చారు. మూడు నెలల్లో కాళేశ్వరం నీళ్లు పాలకుర్తి నియోజకవర్గానికి అందించి లక్ష ఎకరాలకు రెండు పంటలకు సాగు నీరు అందిస్తామన్నారు. కూటమి అధికారంలోకి వస్తే చంద్రబాబు పెత్తనం పెరిగిపోతుందని పేర్కొన్నారు. దయాకర్ రావును యాబై వేల మెజార్టీతో గెలిపించాలని హరీష్‌రావు కోరారు.