టిఆర్ఎస్ థీమా: హుజూర్ నగర్ ఫలితాలే దుబ్బాకలో కూడా... 

టిఆర్ఎస్ థీమా: హుజూర్ నగర్ ఫలితాలే దుబ్బాకలో కూడా... 

దుబ్బాక ఎన్నికలకు సంబంధించిన నామినేషన్ ను ఆ పార్టీ అభ్యర్థి సుజాత దాఖలు చేసిన సంగతి తెలిసిందే. దుబ్బాక ఎన్నికల్లో తెరాస పార్టీ విజయం సాధించి తీరుతుందని మంత్రి హరీష్ రావు పేర్కొన్నారు.  ఈరోజు దుబ్బాకలో మీడియా సమావేశం ఏర్పాటు చేసి దుబ్బాక ఎన్నికల గురించి మాట్లాడారు.  దుబ్బాక ఎన్నికల్లో సుజాత అభ్యర్థిత్వాన్ని ప్రజలు కోరుకుంటున్నారని అన్నారు.  కాంగ్రెస్, బీజేపీలు అభివృద్ధికి నిరోధకులుగా మారారని, అడుగడుగునా అభివృద్ధికి అడ్డుపడుతున్నారని దుయ్యబట్టారు. హుజూర్ నగరంలో వచ్చిన ఫలితాలే దుబ్బాకలో కూడా రిపీట్ అవుతాయని మంత్రి హరీష్ రావు తెలిపారు.  నిజామాబాద్ లో కాంగ్రెస్, బీజేపీకి డిపాజిట్లు రాలేదని, దుబ్బాకలో కూడా అదే రిపీట్ అవుతుందని మంత్రి హరీష్ రావు పేర్కొన్నారు.  తెరాస ప్రభుత్వం ఇంటింటికి నల్లా పెట్టి నీళ్లు ఇస్తోందని, తెరాస పార్టీ అభ్యర్ధికి ఏ గ్రామానికి వెళ్లినా అపూర్వ స్వాగతం లభిస్తోందని అన్నారు.  తెరాస పార్టీ దుబ్బాకలో భారీ మెజారిటీతో గెలుస్తుందని, రాబోయే రోజుల్లో దుబ్బాకను అభివృద్ధి పథంలో తీసుకెళ్తామని మంత్రి హరీష్ రావు పేర్కొన్నారు.