త్వరలోనే మరికొందరు నేతలు వైసీపీ గూటికి-మంత్రి బొత్స

త్వరలోనే మరికొందరు నేతలు వైసీపీ గూటికి-మంత్రి బొత్స

ఏపీలో వైసీపీ అధికారంలోకి వచ్చినప్పట్టి నుంచి క్రమంగా ఆ పార్టీలోకి వలసలు కొనసాగుతూనే ఉన్నాయి.. ముఖ్యంగా టీడీపీ సీనియర్ నేతలు, సిట్టింగ్ ఎమ్మెల్యేలు సైతం.. వైసీపీ గూటికి చేరుతున్నారు.. ఈ సమయంలో కీలక వ్యాఖ్యలు చేశారు మంత్రి బొత్స సత్యనారాయణ.. నోటి మాటల ద్వారా మనిషిమాట విలువ తెలుస్తుంది.. సభ్య సమాజంలో గౌరవంగా ఉండేవాళ్లు నోరు అదుపులో పెట్టుకోవాలన్న ఆయన.. చట్టం తన పని తాను చేస్తుంది. ఎన్నికల్లో ఓడిపోయిన వాళ్లు ఎన్ని మాటలైనా చెబుతారు.. రాజకీయనాయకులు అదుపులో ఉండాలి అని హితవుపలికారు. ఇక, పార్టీపట్ల, పనితీరు పట్ల అభిమానం ఉన్నవారు ఎవ్వరైనా పార్టీలోకి వస్తారన్న బొత్స.. త్వరలో మరి కొంతమంది పార్టీలోకి వస్తారని తెలిపారు.. మరోవైపు, విశాఖలో  మర్రిపాలెం వెళ్లే మార్గం వచ్చే నెలలో ప్రారంభిస్తాం.. ఫ్లైఓవర్ మొత్తం పూర్తెయ్యాక సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ప్రారంభిస్తారని... విశాఖలో మెట్రో ఆఫీస్‌ను త్వరలోనే ప్రారంభించనున్నట్టు వెల్లడించారు మంత్రి బొత్స. అయితే, బొత్స వ్యాఖ్యలు చూస్తుంటే.. మరికొంతమంది త్వరలోనే వైసీపీలో చేరతారా? వాళ్లు ఎవరు? అనే చర్చమొదలైంది.