నారా లోకేష్‌కు మంత్రి బాలినేని లీగల్ నోటీసులు
టీడీపీ నేత, ఎమ్మెల్సీ నారా లోకేష్‌కు లీగల్ నోటీసులు పంపించారు మంత్రి బాలినేని శ్రీనివాస్ రెడ్డి... లోకేష్‌తో పాటు ఏడుగురు టీడీపీ నేతలకు, మరో రెండు టీవీ ఛానెళ్లకు కూడా నోటీసులు పంపించారు. గత నెలలో తమిళనాడులో చిక్కిన రూ.5 కోట్లతో తనకు సంబంధం ఉందని టీడీపీ నేతలు ప్రచారం చేయడంపై ఆగ్రహం వ్యక్తం చేసిన బాలినేని.. బహిరంగ క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు.. తనపై తప్పుడు ప్రచారం చేసిన టీడీపీ నాయకులతో పాటు.. ఓ తెలుగు న్యూస్ ఛానల్, తమిళ న్యూస్ ఛానల్‌కు కూడా నోటీసులు పంపించారు. కాగా, తమిళనాడులో గత నెలలో పోలీసులకు పట్టుబడ్డ 5 కోట్ల రూపాయల నగదు మంత్రి బాలినేనిదే నంటూ ఆరోపణలు రాగా.. ఆ ఆరోపణలు మంత్రి బాలినేని కొట్టిపారేసిన సంగతి తెలిసిందే.
ఫేస్ బూక్ వ్యాఖ్యలు (0)