దాడులు చేస్తే ఊరుకోం..! మేం అధికారంలో ఉన్నామని గుర్తుంచుకోవాలి..!

దాడులు చేస్తే ఊరుకోం..! మేం అధికారంలో ఉన్నామని గుర్తుంచుకోవాలి..!

అమరావతి ప్రాంతంలో వీళ్లు రెచ్చగొట్టినా? వాళ్లు వాగ్వాదానికి దిగినా..? మొత్తానికి ఎమ్మెల్యేలను అడ్డుకోవడం, వారి వాహనాలపై దాడులకు దిగడం చర్చగా మారింది. అయితే, ఎమ్మెల్యేలపై దాడులు చేస్తామంటే మేం చూస్తూ ఊరుకోం... మేం అధికారంలో ఉన్నామని తెలుగుదేశం పార్టీ నేతలు గుర్తుంచుకోవాలని వార్నింగ్ ఇచ్చారు మంత్రి అవంతి శ్రీనివాస్... ఇక, మూడు రాజధానుల నిర్ణయాన్ని స్థానికసంస్థల ఎన్నికలను రెఫరెండంగా భావించలేమన్న ఆయన.. మూడు రాజధానుల అంశం అన్ని ప్రాంతాల్లో ప్రభావం చూపబోదన్నారు. ఈ ఎన్నికల్లో స్థానిక అంశాలే కీలకంగా పనిచేస్తాయని.. పలాసలో ఉన్న వారికి, అనంతపురంలో ఉన్న వారికి రాజధానితో సంబంధం ఏమిటీ..? అని ప్రశ్నించారు. 

రాజధాని రైతులకు మేలు చేసే నిర్ణయాలనే సీఎం వైఎస్ జగన్ తీసుకుంటారని తెలిపారు మంత్రి అవంతి... ఈ ఎన్నికల్లో వైసీపీ అన్ని చోట్లా విజయం సాధిస్తుందనే నమ్మకాన్ని వ్యక్తం చేసిన ఆయన.. చంద్రబాబులా మా ప్రభుత్వం పూటకు ఓ మాట చెప్పదు... గత ఎన్నికల ఫలితాల లాగానే స్థానిక ఎన్నికల ఫలితాలూ ఉంటాయని దీమా వ్యక్తం చేశారు.