ముందే జగన్‌పై కేసులు.. పవన్‌ చెప్పాల్సిన అవసరంలేదు..!

ముందే జగన్‌పై కేసులు.. పవన్‌ చెప్పాల్సిన అవసరంలేదు..!

ధర్మం జగన్ పక్షానే ఉంది కాబట్టే  మొన్నటి ఎన్నికల్లో  అధికారం కట్టబెట్టిన విషయం పవన్ కళ్యాణ్ మరువద్దని మంత్రి అవంతి శ్రీనివాస్ హితవు పలికారు. ప్రజల తీర్పును పవన్ అవహేళన చేయడం సరికాదని, వారి తీర్పును గౌరవించడం నేర్చుకోవాలని సూచించారు.  ఎంత పెద్ద నాయకుడైనా ప్రజా స్వామ్యంలో ప్రజల తీర్పును శిరసావహించాలని చెప్పారు. జగన్ మీద కేసులు ఎన్నికల ముందే ఉన్నాయని,  ఆ విషయం ప్రజలకు పవన్ కొత్తగా చెప్పాల్సిన అవసరం లేదన్నారు. కేసుల గురించి పదే పదే ప్రస్తావించి పవన్ తన గౌరవాన్ని తగ్గించుకోవద్దని సలహా ఇచ్చారు మంత్రి అవంతి శ్రీనివాసరావు. పవన్ మీద కేసుల్లేవా అని మండిపడిన మంత్రి, తీయాలంటే తామూ తీయగలమని హెచ్చరించారు.