మానవతా దృక్పథంతో వైద్యులు, వైద్య సిబ్బంది ముందుకు రావాలి..

మానవతా దృక్పథంతో వైద్యులు, వైద్య సిబ్బంది ముందుకు రావాలి..

మానవతా దృక్పథంతో వైద్యులు, వైద్య సిబ్బంది క‌రోనా సేవ‌లు అందించడానికి ముందుకు రావాలని విజ్ఞ‌ప్తి చేశారు ఏపీ మంత్రి అవంతి శ్రీ‌నివాస్‌.. విశాఖ వీఎంఆర్డీఏ చిల్డ్రన్ థియేటర్‌లో జ‌రిగిన కోవిడ్ టాస్క్ ఫోర్స్ కమిటీ సమావేశంలో పాల్గొన్న ఆయ‌న‌.. ఈ సంద‌ర్భంగా మాట్లాడుతూ.. క‌రోనా పేషెంట్స్ కోసం సేవలందించేందుకు వైద్యుల కొరత ఉంద‌ని తెలిపారు. అత్యవసర వైద్యం అందించడానికి సిబ్బందిని నియమిస్తున్నామ‌న్న ఆయ‌న‌.. వైద్యుల నియామకానికి నోటిఫికేషన్ ఇచ్చినప్పటికీ ఆశించిన మేర ముందుకు రావడం లేద‌ని.. మానవతా దృక్పథంతో ముందుకు రావాల‌ని కోరారు. ఇక‌, కోవిడ్ రోగుల కోసం విశాఖ‌లో 4400 బెడ్లు సిద్ధం చేశామ‌ని వెల్ల‌డించిన మంత్రి అవంతి.. విశాఖ‌లో రోజుకు 3 వేల మందికి కోవిడ్ టెస్టులు చేస్తున్నారని తెలిపారు. ఈ సంఖ్య‌ను ఐదు వేలకు పెంచాలని నిర్ణ‌యించిన‌ట్టు చెప్పుకోచ్చారు మంత్రి.