దమ్ముంటే బాబు సీబీఐ విచారణకు సిద్ధపడాలి : మంత్రి అనిల్

దమ్ముంటే బాబు సీబీఐ విచారణకు సిద్ధపడాలి : మంత్రి అనిల్

దమ్ముంటే బాబు సీబీఐ విచారణకు సిద్ధపడాలని మంత్రి అనిల్ కుమార్ యాదవ్ టిడిపి అధినేత చంద్రబాబుకు సవాల్ విసిరారు. అమరావతి రాజధాని భూకుంభకోణంపై ఏసీబీ కేసు నమోదు చేయడంపై అనిల్ స్పందించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రభుత్వం సీబీఐ విచారణ జరిపించాలని కేంద్రానికి రాసిన లేఖకు తాము సహకరిస్తామని బాబు కేంద్రానికి లేఖ రాయగలరా ? అని ప్రశ్నించారు. భూ కుంభకోణంపై సీబీఐ విచారణ స్వీకరించే దమ్ముందా అని ప్రశ్నించారు. రాజధానిలో అక్రమాలు జరగకుంటే చంద్రబాబు ఎందుకు భయపడుతున్నారు? అని అడిగారు. ఫైబర్‌ గ్రిడ్‌లో కూడా భారీ అవినీతి జరిగిందన్నారు. రాజధాని కుంభకోణంపై చట్టం తన పని తాను చేసుకుపోతుందని అన్నారు. అంతే కాకుండా నెల్లూరు జిల్లాలో ఎప్పుడూ లేనంతగా పంటలు పండాయని..  రైతుల కోసమే ప్రభుత్వం ధరల స్థిరీకరణ నిధి ఏర్పాటు చేసిందని అన్నారు. చంద్రబాబు అనవసరంగా తప్పుదోవ పట్టిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.