ఓటీటీ: కృతిసనన్ ఆ పాత్రలో నటిస్తుందా?

ఓటీటీ: కృతిసనన్ ఆ పాత్రలో నటిస్తుందా?

సూపర్ స్టార్ మహేష్ బాబు నటించిన ‘ 1 నేనొక్కడినే ‘ సినిమా ద్వారా తెలుగు ప్రేక్షకులకు పరిచయమైన ముద్దుగుమ్మ కృతిసనన్. ఆతర్వాత తెలుగులో నాగచైతన్య నటించిన దోచేయ్ అనే సినిమాలో నటించింది. ఈ సినిమా ప్రేక్షకులను పెద్దగా అలరించలేకపోయింది. ఇటీవల అదిపురుష్ సినిమాలో ప్రభాస్‌తో నటించే అవకాశం దక్కించుకొంది. ఇక బ్యూటీ లక్ష్మణ్ ఉతేకర్ దర్శకత్వంలో ‘మిమి’ సినిమాలో నటిస్తోంది. ఈ చిత్రంలో కృతిసనన్ అద్దె గర్భంతో పిల్లలకు జన్మనిచ్చే మహిళగా ఓ విభిన్నమైన పాత్రను పోషిస్తున్నారు. పంకజ్ త్రిపాఠి, సుప్రియా పాథక్ తదితరులు నటిస్తున్నారు. ఈ సినిమాకు ఏఆర్ రెహమాన్ సంగీతం అందిస్తున్నారు. ఈ చిత్రం ఓటీటీలో రిలీజ్‌కు సిద్దమవుతున్నది.