2 నెలల్లో కేసీఆర్‌ ప్రభుత్వాన్ని కూలుస్తాం: ఎంఐఎం ఎమ్మెల్యే

2 నెలల్లో కేసీఆర్‌ ప్రభుత్వాన్ని కూలుస్తాం: ఎంఐఎం ఎమ్మెల్యే

మజ్లిస్ చార్మినార్ ఎమ్మెల్యే ముంతాజ్ అహ్మద్ ఖాన్ కామెంట్స్ ఇప్పుడు హాట్ టాపిక్ గా నారాయి. మేము తలుచుకుంటే రెండు నెలల్లోనే టిఆర్ఎస్ ప్రభుత్వాన్ని కూల్చేస్తామని ఆయన అన్నారు. కేటీఆర్ ‘చిలక’ అని పేర్కొన్న ఆయన కేటీఆర్ నిన్న మొన్న రాజకీయాల్లో కళ్ళు తెరిచాడని అన్నారు. మా అధినేత చెప్పినట్టు రాజకీయం మా ఇంటి గుమస్తా తో సమానం అంటూ ఆయన ఈ కామెంట్స్ చేశారు. నిజానికి తెలంగాణలో టీఆర్ఎస్ తీసుకున్న నిర్ణయాలకు ఎంఐఎం మద్దతు ప్రకటిస్తూ వస్తున్న సంగతి తెలిసిందే. బీజేపీకి వ్యతిరేకంగా దేశంలో పలు కార్యక్రమాలను నిర్వహించాలని టీఆర్ఎస్, ఎంఐఎం గతంలో ప్లాన్ చేశాయి. ఈ క్రమంలోనే కార్ స్టీరింగ్ ఎంఐఎం చేతిలో ఉందని రాష్ట్రంలో విపక్షాలు ఆరోపిస్తున్నాయి. వాటిని తిప్పి కొట్టేందుకు ఈ కామెంట్స్ చేసి ఉండవచ్చని అంటున్నారు. అయితే తమకు వారికి పొత్తి లేదని రెండు పార్టీలు ప్రకటించాయి కూడా.