కౌంటింగ్ కేంద్రంలోకి సెల్‌ఫోన్‌తో ఎంట్రీ.. ఎంఐఎం నేతను లాక్కెళ్లిన పోలీసులు
గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల కౌంటింగ్ సమయంలో అత్యుత్సాహం ప్రదర్శించిన ఎంఐఎం నేతను.. కౌంటింగ్ కేంద్రం నుంచి బయటకు లాక్కెళ్లారు పోలీసులు... యూసఫ్ గూడలోని కోట్ల విజయ భాస్కర్ రెడ్డి స్టేడియంలో గ్రేటర్ ఎన్నికల కౌంటింగ్ కొనసాగుతుండగా... ఆ సెంటర్లోకి ఎంఐఎం పార్టీ అభ్యర్థి షాహినా బేగం భర్త షరీఫుద్దీన్.. అనుమతి లేకుండా సెల్‌ఫోన్‌తో ప్రవేశించారు.. ఆ సెల్‌ఫోన్‌ను ఎవరూ గుర్తించకుండా... షూస్‌లో పెట్టుకుని మరీ కౌంటింగ్ కేంద్రానికి వచ్చాడు.. ఇది గమనించిన కొందరు... ఆ దృశ్యాలను సెల్ఫోన్లలో బంధించి పోలీసులకు సమాచారం ఇచ్చారు.. దీంతో.. వెంటనే షరీఫుద్దీన్‌ను కౌంటింగ్ హాల్ నుంచి బయటకు లాక్కెళ్లారు పోలీసులు.. అనుమతి లేకుండా కౌంటింగ్ కేంద్రంలోకి ఎంఐఎం నేత సెల్ ఫోన్‌తో రావడం తీవ్ర కలకలం రేపింది.
ఫేస్ బూక్ వ్యాఖ్యలు (0)