ముంబై జట్టులోకి మరో స్పీడ్‌స్టర్‌

ముంబై జట్టులోకి మరో స్పీడ్‌స్టర్‌
గాయం కారణంగా ఈ సీజన్‌ ఐపీఎల్‌ నుంచి తప్పుకున్న ఆస్ట్రేలియా ఫాస్ట్‌ బౌలర్‌ పాట్ కమిన్స్ స్థానాన్ని ముంబై ఇండియన్స్‌ భర్తీ చేసింది. కమిన్స్‌ ప్లేస్‌లో న్యూజిలాండ్ పేసర్ ఆడమ్ మిల్నేను ఎంపిక చేసుకుంది. మిల్నేను ఎంపిక చేసినట్టు అధికారికంగా ప్రకటించనప్పటికీ.. అతను ఇప్పటికే ముంబై చేరుకున్నట్టు తెలిసింది. శనివారం వాంఖడే స్టేడియంలో ముంబై ఆటగాళ్లతో కలిసి మిల్నే ప్రాక్టీస్‌ చేసినట్టు సమాచారం. ఈ ఏడాది జరిగిన వేలంలో కనీస ధర రూ.75 లక్షలకు మిల్నేను ఏ జట్టూ కొనుగోలు చేయలేదు. దీంతో.. అదే ధరకు ఇప్పుడు ముంబై ఇండియన్స్‌ అతడిని సొంతం చేసుకుంది. కాగా.. గత ఏడాది ఐపీఎల్‌లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు తరఫున ఐదు ఐపీఎల్ మ్యాచ్‌లాడిన మిల్నే.. నాలుగు వికెట్లు తీశాడు. ఇక.. ఇప్పటి వరకు 70 అంతర్జాతీయ టీ20 మ్యాచ్‌లు ఆడిన మిల్నే.. 23.21 సగటుతో 83 వికెట్లు పడగొట్టాడు.