వలస కార్మికులపై క్లోరినేషన్...మున్సిపల్ కార్మికుడి ఓవరాక్షన్.!

వలస కార్మికులపై క్లోరినేషన్...మున్సిపల్ కార్మికుడి ఓవరాక్షన్.!

లాక్ డౌన్ వేళ వలస కార్మికులు పడుతున్న గోసలు అన్నీ ఇన్ని కాదు. ఉపాధికోసం వచ్చిన నగరాల్లో పనులు లేక అక్కడ ఉండలేక సొంత గ్రామాలకు వెళ్లలేక అవస్థలు పడుతున్నారు. ఇక సొంత గ్రామాలకు వెళ్లే వారిలో చాలా మంది ఆక్సిడెంట్ లకు గురైన ఘటనలు కూడా జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో కేంద్రం వలస కార్మికులను తరలించడానికి శ్రామిక్ రైళ్లను ఏర్పాటు చేసింది. దీంతో ఢిల్లీలో సొంత ఉరికి వెళ్లడానికి కూలీలు రైల్వస్టేషన్ కు చేరుకున్నారు. కార్మికులు రైలు ఎక్కడానికి సిద్ధంగా ఉన్న సమయంలో మున్సిపల్ కార్మికుడు వారిపై క్లోరినేషన్ స్ప్రే చేసాడు. దాంతో వారి కళ్ళలో మంటలు వచ్చాయి. కళ్ళలో మంటలు రావడంతో వారి భాధలు వర్ణనాతీతం. ఇప్పటికే కోరినేషన్ చల్లడం వల్ల వైరస్ చావదని దానితో మనుషుల ఆరోగ్యానికే ప్రమాదమని డబ్ల్యూహెచ్ఓ హెచ్చరించింది. అయినప్పటికీ ఢిల్లీలో మళ్ళీ ఎలాంటి ఘటనలు చోటు చేసుకోవడం బాధాకరం.