చలికి వణుకుతూ షూట్ చేస్తున్న ఆర్ఆర్ఆర్ టీమ్

చలికి వణుకుతూ షూట్ చేస్తున్న ఆర్ఆర్ఆర్ టీమ్

తెలుగు సినిమా స్థాయిని పెంచిన దర్శకుల్లో రాజమోళి ఒకరి. బాహుబలి సినిమా తో ఆయన క్రియేట్ చేసిన రికార్డ్స్ అన్ని ఇన్ని కాదు. ఇక ఈ సినిమా తర్వాత జక్కన్న తెరకెక్కిస్తున్న సినిమా ఆర్ఆర్ఆర్. యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కలిసి నటిస్తున్న ఈ సినిమా ఫై భారీ అంచనాలు ఉన్నాయి. తారక్ గిరిజన వీరుడు కొమరం భీమ్ గా చరణ్ మన్యం వీరుడు అల్లూరి సీతారామరాజుగా నటిస్తున్నారు. ఇటీవల ఈ సినిమా నుంచి రెండు టీజర్స్ విడుదల అయ్యాయి. ముందుగా రామ్ చరణ్ పుటిన రోజు సందర్భంగా 'భీమ్ ఫర్ రామరాజు' పేరుతో చరణ్ టీజర్ను విడుదల చేసాడు జక్కన. ఆ తర్వాత కరోనా కారణంగా కాస్త ఆలస్యంగా ఎన్టీఆర్ టీజర్ 'రామరాజు ఫర్ భీమ్' ను విడుదల చేసారు. కరోనా కారణంగా వాయిదా పడిన ఈ సినిమా షూటింగ్ ఇటీవలే తిరిగి ప్రారంభం అయ్యింది. ఈ సినిమా షూటింగ్ ను శరవేగంగా షూట్ చేస్తున్నాడు జక్కన. తాజాగా షూటింగ్ సమయంలో తీసిన ఓ వీడియో సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుంది. ఆర్.ఆర్.ఆర్ టీం ఓ వీడియో ట్విట్టర్ షేర్ చేస్తూ 'సెట్ హీటర్స్ లేకుండా ఎవరూ ఈ చల్లని గాలుల నుంచి తప్పించుకోలేరు' అని పేర్కొంది. ఈ వీడియోలో యూనిట్ సభ్యులు మొత్తం చలిలో వణుకుతూ షూట్ లో పాల్గొంటున్నట్లు కనిపిస్తోంది. రాజమౌళి, ఎన్టీఆర్ , కెమెరామెన్ సెంథిల్ కుమార్.. మిగిలిన వారు సెట్ లో ఏర్పాటు చేసిన హీటర్స్ దగ్గర చలి కాచుకుంటూ కనిపించరు. అసలే చలికాలం పైగా అర్ధరాత్రి షూటింగ్ దాంతో చిత్రబృందం చలికి తట్టుకోలేకపోతున్నారు. ఈ సినిమాను డీవీవీ దానయ్య నిర్మిస్తున్నాడు. కీరవాణి సంగీతం సమకూరుస్తున్నాడు.