వర్క్ ఫ్రం హోంపై మైక్రోసాఫ్ట్‌ కీలక నిర్ణయం.. ఇక శాశ్వతంగా..!

వర్క్ ఫ్రం హోంపై మైక్రోసాఫ్ట్‌ కీలక నిర్ణయం.. ఇక శాశ్వతంగా..!

కరోనా వైరస్‌ ఉద్యోగుల జీవితాల్ని పూర్తిగా మార్చేసింది... ఎప్పుడూ లేని విధంగా అన్ని కంపెనీలు వర్క్‌ ఫ్రం హోం బాటపట్టాల్సి వచ్చింది... ఇక, దిగ్గజ కంపెనీలు అయితే ఏకంగా... ఏడాది, రెండేళ్లు వర్క్‌ఫ్రం హోం అంటున్నాయి.. ఇదే సమయంఓల మైక్రోసాఫ్ట్‌ వర్క్‌ఫ్రం హోంపై కీలక నిర్ణయం తీసుకుంది... తమ ఉద్యోగులకు శాశ్వతంగా వర్క్ ఫ్రం హోం సదుపాయం కల్పించేందుకు మైక్రోసాఫ్ట్‌ నిర్ణయం తీసుకున్నట్టుగా ప్రచారం జరుగుతోంది.. ప్రపంచాన్ని వణికిస్తోన్న కరోనావైరస్‌ సంక్షోభం ఇంకా కొనసాగుతూనే ఉన్నందున ఈ నిర్ణయానికి వచ్చినట్టు తెలుస్తోంది. ఇక, కరోనా ప్రభావంతో అమెరికాలోని మైక్రోసాఫ్ట్ కార్యాలయాలు చాలా వరకు ఇప్పటికీ తెరుచుకోని పరిస్థితి నెలకొంది.. 2021 జనవరి నుంచి పూర్తిస్థాయిలో అన్ని కార్యాలయాలు తెరిచే అవకాశం ఉందని తెలుస్తోంది. ఈ క్రమంలో... కరోనా భయంతో ఆఫీసుకు ఏం వెళ్తాం.. ఇంటి నుంచే పనిచేద్దామనుకుంటున్న ఉద్యోగులకు శాశ్వతంగా ఆ అవకాశం కల్పించే విధంగా మైక్రోసాఫ్ట్ నిర్ణయం తీసుకుంది. అయితే.. ఈ విధానాన్ని ఎంచుకున్న వారు కార్యాలయంలోని తమ వర్క్ స్పేస్‌ను వదులుకోవాల్సి ఉంటుందని చెబుతున్నారు మైక్రోసాఫ్ట్ ప్రతినిధులు. 

కానీ, మైక్రోసాఫ్ట్ ప్రతినిధులు మాత్రం ఈ శాశ్వత వర్క్ ఫ్రం హోం విధానంపై స్పందించడంలేదు.. ఉద్యోగుల, సంస్థ అవసరాలకు అనుగుణంగా పని చేసే విధానంలో మార్పులు తీసుకురావడమే తమ లక్ష్యంగా చెబుతున్నారు.. కానీ, క్లారిటీ మాత్రం ఇవ్వడంలేదు. ఇక, శాశ్వతంగా వర్క్ ఫ్రం హోం కోరుకునే ఉద్యోగులు ముందే తమ హెచ్‌వోడీ అనుమతి తీసుకోవాల్సి ఉంటుంది. మరోవైపు.. వారంలో సగం కంటే తక్కువ రోజులు కార్యాలయానికి దూరంగా ఉండాలనుకునే వారు ఎటువంటి అనుమతులు తీసుకోవాల్సిన అవసరం లేదని చెబుతున్నారు. ల్యాబ్స్, ట్రైనింగ్ విభాగాల్లోని వారికి మాత్రం శాశ్వత వర్క్ ఫ్రం హోం సౌలభ్యం ఉండదంటున్నారు మైక్రోసాఫ్ట్‌ ప్రతినిధులు. కాగా, మైక్రోసాఫ్ట్‌లో మొత్తంగా 1.63 లక్షల మంది వరకు పనిచేస్తుండగా.. వారిలో 96 వేల మంది అమెరికాలోనే విధులు నిర్వహిస్తున్నారు. మిగతా వారు ఇతర ప్రాంతాల్లో ఉన్నారు. అయితే, దీనిపై మాత్రం మరింత క్లారిటీ రావాల్సి ఉంది.