ఇప్పుడు ధోని లాంటి ప్లేయర్ టీంఇండియాకు అవసరం..

ఇప్పుడు ధోని లాంటి ప్లేయర్ టీంఇండియాకు అవసరం..

ప్రస్తుతం టీమిండియాకు మాజీ కెప్టెన్ ఎంఎస్ ధోనీ లాంటి ప్లేయ‌ర్ అవ‌స‌ర‌మ‌ని వెస్టిండీస్ మాజీ పేస్ బౌల‌ర్ మైకేల్ హోల్డింగ్ పేర్కొన్నాడు‌. బలమైన బ్యాటింగ్‌ లైనప్‌ ఉన్నప్పటికీ భారీ ఛేదనలో ధోనీ నైపుణ్యం, అతడి పాత్రను టీమిండియా ఎంతో మిస్‌ అవుతుందని‌ అభిప్రాయపడ్డాడు. జట్టులో ఎంఎస్ ధోనీ లేకపోవడం టీమిండియాకు కష్టంగా మారింది. గతంలో ధోనీ జట్టులో ఉన్నప్పుడు భారత్ గొప్ప విజయాలు సాధించింది. ఆసీస్ పై హార్దిక్‌ గొప్ప ఇన్నింగ్స్‌ ఆడాడు. కానీ కోహ్లీ సేనకు ధోనీ వంటి ప్లేయర్‌ అవసరం. ఛేదనలో ఎటువంటి పరిస్థితుల్లోనైనా అతడు కంగారు పడటం మనం ఎన్నడూ చూడలేదు. లక్ష్యాన్ని ఎలా సాధించాలో అతడికి బాగా తెలుసు. తనతో పాటు క్రీజులో ఉండే ఆటగాడికి అతడు సలహాలు ఇస్తూ సాయం చేస్తుంటాడు అని మైకేల్ తెలిపాడు.