నాలుగోసారి మొదటి మ్యాచ్ లో ఎదురుపడనున్న చెన్నై, ముంబై

నాలుగోసారి మొదటి మ్యాచ్ లో ఎదురుపడనున్న చెన్నై, ముంబై

కరోనా కారణంగా మార్చి 29 న ప్రారంభం కావాల్సిన ఐపీఎల్ 2020 సెప్టెంబర్ 19 అంటే రేపు ప్రారంభం అవుతుంది. ఇక గత సీజన్ లో ఫైనల్స్ లో తలపడిన ముంబై ఇండియన్స్, చెన్నై సూపర్ కింగ్స్ రేపు ప్రారంభం కానున్న ఐపీఎల్ మెదటి మ్యాచ్ లో ఎదురుపడుతున్నాయి. అయితే ఇప్పటివరకు ఈ రెండు జట్లు 2009, 2012, 2018 మూడు ఐపీఎల్ సీజన్ లలో కూడా మొదటి మ్యాచ్ లో తలపడ్డాయి. అందులో మొదటిసారి 2009 లో ఈ రెండు జట్లు ఆడిన మొదటి మ్యాచ్ లో ముంబై బౌలర్లు లసిత్ మలింగ, జయసూర్య చెరో 5 వికెట్లు తీయడంతో ముంబై జట్టు 20 పరుగుల తేడాతో విజయం సాధించింది. ఆ తర్వాత 2012 లో కూడా ముంబై బౌలర్ల దెబ్బకు చెన్నై 112 పరుగులే చేయడంతో ప్రత్యర్థి జట్టు ముంబై సులువుగా విజయం సాధించింది. కానీ ఆ తర్వాత 2018 లో మాత్రం చెన్నై విజయం సాధించింది. 166 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగ్గిన చెన్నై జట్టు 118 పరుగులకు 8 వికెట్లు కోల్పోయింది. కానీ ఆ తర్వాత సిఎస్కే ఆల్ రౌండర్ డ్వేన్ బ్రావో కేవలం 30 బంతుల్లో 68 పరుగులు చేయడంతో 1 వికెట్ తేడాతో చెన్నై విజయం అందుకుంది. ఇక రేపు నాలుగోసారి తలపడుతున్న ఈ మొదటి మ్యాచ్ లో ఎవరు విజయం సాధిస్తారు అనేది చూడాలి.