ఆ రాష్ట్రంలో ఏప్రిల్ 15న లాక్ డౌన్ ఎత్తివేస్తారట..కానీ!

ఆ రాష్ట్రంలో ఏప్రిల్ 15న లాక్ డౌన్ ఎత్తివేస్తారట..కానీ!

దేశంలో  మోడీ ప్రకటించిన లాక్ డౌన్ పీరియడ్ ఈ నెల 14న ముగియనుంది. దాంతో ప్రజల్లో లాక్ డౌన్ ఎత్తేస్తారా లేదా కొనసాగిస్తారా అనే ప్రశ్న మొదలైంది. దేశం లో కరోనా కేసుల సంఖ్య పెరిగిపోయింది ఈ నేపథ్యంలో కేంద్రం ఇంకా ఎలాంటి ప్రకటన విడుదల చేయలేదు. కాగా కేసీఆర్ మాత్రం లాక్ డౌన్ పొడిగిస్తేనే మంచిదని తన నిర్ణయాన్ని ప్రధానికి కూడా చెబుతానని అన్నారు. మరోవైపు మేఘాలయ రాష్ట్రంలో లాక్ డౌన్ ఎత్తివేసే నిర్ణయం తీసుకుంది. ఏప్రిల్ 15 నుండి లాక్ డౌన్ నిలిపివేస్తున్నామని ఇకపై అన్ని కార్యాలయాలు యథాతథంగా పనిచేయవచ్చని ప్రకటించింది. ప్రైవేట్ వ్యాపారులకు మాత్రం కొన్ని నిబంధనలు ఉంటాయని తెలిపింది. పాఠశాలలకు కూడా ఏప్రిల్ 30 వరకు సెలవులు ప్రకటించింది. ఇప్పటివరకు మేఘాలయాలో ఒక్క కరోనా కేసు కూడా నమోదవలేదు దీంతో రాష్ట్రం ఈ నిర్ణయం తీసుకుంది.