శ్రీకారం కోసం కదిలొస్తున్న చిరు, కేటీఆర్

శ్రీకారం కోసం కదిలొస్తున్న చిరు, కేటీఆర్

టాలీవుడ్ యంగ్ హీరో శర్వానంద్ ఎప్పటికప్పుడు వైవిధ్యమైన కథలతో అందరినీ ఆకట్టుకుంటారు. ఈ సారి కూడా అదే తరహాలో శ్రీకారం సినిమాతో మన ముందుకు రానున్నారు. రైతు కష్టాలను చూపిస్తూ రానున్న ఈ సినిమా వరుస అప్‌డేట్‌లను ఇస్తోంది. ఇప్పటి వరకు ఈ సినిమా నుంచి వచ్చిన పోస్టర్‌లు, పాటలు, టీజర్, ట్రైలర్ అన్నీ కూడా సినిమాపై అంచనాలను అధికం చేశాయి. ఈ సినిమాలో ప్రియాంక అరుల్ మోహన్ హీరోయిన్‌‌గా నటిస్తున్నారు. ఈ సినిమాను కిశోర్ రెడ్డి దర్శకత్వంలో రామ్ అచంట, గోపీ అచంట సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఈ సినిమాలో రావు రమేష్, సాయి కుమార్ తదితరులు కీలక పాత్రల్లో కనిపించనున్నారు. అయితే ఈ సినిమా మార్చి 11న ప్రపంచ వ్యాప్తంగా విడుదల కానుంది. ఈ మేరకు మూవీ మేకర్స్ ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్‌ను జరపాలని నిశ్చయించుకున్నారు. అందుకుగాను రేపు అంటే మార్చి 8న సాయంత్రం 6 గంటల నుంచి ఖమ్మంలోని మమతా హాస్పిటల్ గ్రౌండ్స్‌లో ఈ ఈవెంట్‌ను నిర్వహించనున్నారు. ఈ వేడుకకు మెగాస్టార్ చిరంజీవి ముఖ్య అతిథిగా విచ్చేస్తున్నారు. అలాగే మార్చి 9న హైదరాబాద్‌లో జరగనున్న కార్యక్రమానికి కేటీఆర్ ముఖ్య అతిథిగా వస్తున్నారు. ఈ సినిమా కోసం ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. మరి శర్వానంద్ అభిమానుల అంచనాలను అందుకుంటారా లేదా అనేది వేచి చూడాలి.