పవన్ కు చిరు మద్దతు...!!? 

పవన్ కు చిరు మద్దతు...!!? 

పవన్ సినిమాల్లోకి రావడంపై నాదెండ్ల మనోహర్ ఆసక్తికర వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే. పవన్ కళ్యాణ్ సినిమాలతో పాటుగా రాజకీయాల్లోకూడా కొనసాగుతారని, పవన్ కళ్యాణ్ రాజకీయాలకు తన మద్దతు ఉంటుందని చిరంజీవి చెప్పారని నాదెండ్ల మనోహర్ పేర్కొన్నారు. చిరంజీవి ప్రజారాజ్యం పార్టీ స్థాపించిన సమయంలో పవన్ కళ్యాణ్ యువరాజ్యం పార్టీకి అధ్యక్షుడిగా ఉన్నారు.  చిరు రాజకీయాలకు దూరంగా ఉంటూ ప్రస్తుతం సినిమాలు చేస్తున్నారు.  ఎప్పటికైనా చిరంజీవి తిరిగి రాజకీయాల్లోకి వస్తారని చాలా కాలంగా ప్రచారం జరుగుతూనే ఉన్నది. ఒక వేళ తిరిగి రాజకీయాల్లోకి వస్తే ఏ పార్టీలో చేరుతారు అన్నదానిపై సర్వత్రా ఉత్కంఠత నెలకొన్నది.  అయితే, ఈరోజు జనసేన పార్టీ నాయకుడు నాదెండ్ల మనోహర్ చిరు రాజకీయాలపైన కూడా ఆసక్తికర వ్యాఖ్యలు చేయడంతో చిరు రాజకీయాల్లోకి ఎంట్రీపై మరోసారి ఉత్కంఠత నెలకొన్నది.