కేసీఆర్‌కు మెగాస్టార్ కృతజ్ఞతలు..

కేసీఆర్‌కు మెగాస్టార్ కృతజ్ఞతలు..

తెలంగాణ సీఎం కేసీఆర్‌ను ప్రగతి భవన్‌లో కలిశారు టాలీవుడ్ ప్రముఖులు.. షూటింగ్‌లు, ప్రీ ప్రొడక్షన్‌ పునరుద్ధరణ, థియేటర్ల పునఃప్రారంభం తదితరల అంశాలపై చర్చించారు.. షూటింగ్‌లు, థియేటర్లు తెరిచేందుకు అనుమతి ఇవ్వాల్సిందిగా సీఎంకు విజ్ఞప్తి చేశారు సినీ పెద్దలు.. అయితే, జూన్‌లో సినిమా షూటింగ్‌లు ప్రారంభించుకోవాలని ఈ సందర్భంగా సూచించారు సీఎం కేసీఆర్.. సినిమా షూటింగ్‌లపై విధి విధానాలు రూపొందించాలని అధికారులకు ఆదేశించారు.. ఈ సందర్భంగా సీఎం కేసీఆర్‌కు సోషల్ మీడియా వేదికగా కృతజ్ఞతలు తెలిపారు మెగాస్టార్ చిరంజీవి.. ముఖ్యమంత్రితో సమావేశం ముగిసిన తర్వాత సోషల్ మీడియాలో స్పందించిన చిరంజీవి.. "తెలంగాణ ముఖ్యమంత్రి శ్రీ కెసిఆర్ గారికి పరిశ్రమలోని యావన్మంది తరుపున కృతఙ్ఞతలు.. ఈ రోజు వారు సినిమా, టీవీ, డిజిటల్ మీడియాకి సంబంధించిన సమస్యలు సానుకూలంగా విని, వేలాదిమంది దినసరి వేతన కార్మికులకు ఊరట కలిగేలా త్వరలో నిర్ణయం తీసుకుంటామని  చెప్పారు.'' అని ట్వీట్ చేశారు.