వకీల్ సాబ్: చిరంజీవి రివ్యూ

వకీల్ సాబ్: చిరంజీవి రివ్యూ

చాలా కాలం తరువాత థియేటర్ల వద్ద జోష్ కనిపిస్తోంది. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ మూడేళ్ల విరామం తర్వాత వెండితెరపైకి కనిపిస్తుండటంతో ఫ్యాన్స్ హంగామా చేస్తున్నారు. నిన్న విడుదలైన ‘వకీల్ సాబ్’ సినిమా అన్ని సెంటర్లలోనూ సత్తా చాటింది. ఓవర్సీస్‌ తెరపై కూడా రికార్డులు తిరగరాశారు. కాగా ఈ సినిమాపై అభిమానుల లాగే తాను ఎంతో ఉత్సాహంగా ఎదురుచుస్తున్నాను అంటూ ఇదివరకే చెప్పిన మెగాస్టార్ చిరంజీవి.. తొలి రోజే తన కుటుంబ సభ్యులతో కలిసి నిన్న సాయంత్రం హైదరాబాద్ లో ఈ సినిమా చూశారు. అయితే తాజాగా చిరు ట్విట్టర్ ద్వారా వకీల్ సాబ్ సినిమాపై స్పందించారు. 

“మూడు సంవ‌త్స‌రాల త‌ర్వాత ప‌వ‌న్ కల్యాణ్ మ‌ళ్లీ అదే వేడి, అదే వాడి, అదే పవర్... ప్ర‌కాశ్ రాజ్‌తో కోర్టు రూమ్ డ్రామా అద్భుతం. నివేదా థామస్, అంజ‌లి, అనన్య వాళ్ల పాత్ర‌ల్లో జీవించారు. సంగీత ద‌ర్శ‌కుడు థ‌మ‌న్, డీఓపీ వినోద్ ప్రాణం పోశారు. దిల్ రాజుకి, బోనీ క‌పూర్ జీకి, డైరెక్ట‌ర్ వేణు శ్రీరామ్ తో పాటు మిగ‌తా టీమ్ కి నా శుభాకాంక్ష‌లు. అన్నింటికీ మించి మ‌హిళ‌ల‌కి ఇవ్వాల్సిన గౌర‌వాన్ని తెలియ‌జేసే అత్య‌వ‌స‌ర‌మైన చిత్రం. ఈ వ‌కీల్ సాబ్ కేసుల‌నే కాదు.. అంద‌రి మ‌న‌సుల్నీ గెలుస్తాడు” అని మెగాస్టార్ చిరంజీవి పేర్కొన్నారు.