రామ్ చరణ్ ప్రీ లుక్: స్వాగతం 'సిద్ధ' అంటూ కొరటాల ట్వీట్

రామ్ చరణ్ ప్రీ లుక్: స్వాగతం 'సిద్ధ' అంటూ కొరటాల ట్వీట్

మెగాస్టార్ చిరంజీవి ప్రస్తుతం 'ఆచార్య' సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో రామ్ చరణ్ కూడా నటిస్తున్నాడు. తాజాగా దర్శకుడు కొరటాల శివ.. మా 'సిద్ధ' సర్వం సిద్ధం... అంటూ రామ్ చరణ్ ప్రీ లుక్ రివీల్ చేస్తూ ట్వీట్ చేసాడు. ఈ ఫోటోలో రాంచరణ్ బ్యాక్ నుంచి కనిపిస్తూ.. చెవికి రింగుతో, మెడలో రుద్రాక్షతో ఆలయంలోకి ఎంట్రీ ఇస్తున్నట్లుగా కనిపిస్తోంది. రామ్ చరణ్ 'సిద్ధ' పాత్రలో చేయనున్నట్లుగా క్లారిటీ ఇచ్చేసారు కొరటాల. ప్రస్తుతం ఈ అప్డేట్ తో రామ్ చరణ్ ఫ్యాన్స్ ఖుషి అవుతున్నారు. ఆచార్య షూటింగ్ లాక్ డౌన్ తరువాత శరవేగంగా జరుగుతున్నప్పటికీ రామ్ చరణ్ ఇప్పటికి వరకు ఎంట్రీ కాలేదు. తాజాగా చిత్ర బృందం ట్విటర్ ద్వారా తెలియజేస్తూ రామ్ చరణ్ షూట్ లో జాయిన్ అయినట్లుగా తెలిపింది. దేవాలయ శాఖ కుంభకోణాలు రాజకీయాల నేపథ్యంలో ఆద్యంతం థ్రిల్ కి గురి చేసే మాస్ యాక్షన్ ఎంటర్ టైనర్ గా ఈ సినిమా రూపొందుతుంది. మణిశర్మ సంగీతం అందిస్తున్నారు.