ప్లాప్ దర్శకులే కావాలంటున్న మెగా మేనల్లుడు..!!

ప్లాప్  దర్శకులే కావాలంటున్న మెగా మేనల్లుడు..!!

మెగాస్టార్ చిరంజీవి చిన్నల్లుడిగా  హీరోగా ఎంట్రీ ఇచ్చాడు కళ్యాణ్ దేవ్. మొదటి చిత్రం ‘విజేత‌’ కు మంచి టాక్ వచ్చినప్పటికీ ఆశించిన ఫలితాన్ని ఇవ్వలేదు. అందుకే ఎలాగైనా హిట్టు కొట్టాలని ‘సూప‌ర్ మచ్చి’ చిత్రం చేస్తున్నాడు. ఈ చిత్రం షూటింగ్ దశలో ఉంది. ఇది పూర్తయిన వెంటనే.. మరో రెండు సినిమాలు చెయ్యడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చేసాడు. విషయానికి వస్తే .. ఇతను ప్లాప్ డైరెక్టర్లతోనే సినిమాలు చేస్తున్నాడట. తాజాగా మరో ప్లాప్ డైరెక్టర్ కు కూడా ఓకే చెప్పేశాడట. నాగశౌర్యతో ‘అశ్వ‌ద్ధామ‌’ వంటి యావరేజ్ చిత్రాన్ని తెరకెక్కించిన ర‌మ‌ణ్ తేజ వినిపించిన స్క్రిప్ట్ కు కళ్యాణ్ దేవ్ ఇంప్రెస్ అయిపోయాడట. వెంటనే ఆ ప్రాజెక్టు చెయ్యడానికి ఓకే చెప్పేసాడని సమాచారం. ‘ఎస్.ఆర్.టి ఎంటర్టైన్మెంట్స్’ అధినేత రామ్ తాళ్లూరి ఈ చిత్రాన్ని నిర్మించబోతున్నాడట. కళ్యాణ్ దేవ్… మెగా హీరో కాబట్టి చాలా జాగ్రత్తగా సినిమాలు ఎంపిక చేసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. మొదటి సినిమా హిట్ అవ్వలేదు… కాబట్టి సేఫ్ సైడ్ కి ఒకటి రెండు హిట్లు ఉన్న డైరెక్టర్లతో సినిమాలు చేస్తే బెటర్ అని కొందరు విశ్లేషకులు తమ అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు.