చిరంజీవి సైకిల్‌పై చిట్టిబాబు!

చిరంజీవి సైకిల్‌పై చిట్టిబాబు!
మెగాభిమాని ఫ‌న్నీ విన్యాస‌మిది! ఆస‌క్తి రేకెత్తిస్తున్న ఈ ఫోటోని స‌ద‌రు అభిమాని నేరుగా మెగాస్టార్ కోడ‌లు, రామ్‌చ‌ర‌ణ్ స‌తీమ‌ణి ఉపాస‌న కొణిదెల‌కు పోస్ట్ చేశాడు. ఇంట్రెస్టింగ్ .. చిరంజీవితో చిట్టిబాబు.. మార్ఫ్‌డ్ ఇమేజ్ అయినా కానీ, మెగా ఫ్యాన్ క్రియేటివిటీకి అంత‌ర్జాలంలో మెచ్చుకోలు క‌నిపిస్తోంది. ఈ ఫోటోని చ‌ర‌ణ్ అభిమానులు ఆస‌క్తిగా షేర్ చేస్తున్నారు. సామాజిక మాధ్య‌మాలు, అంత‌ర్జాలంలో ఇలాంటి విన్యాసాలు విరివిగా చూస్తున్న‌దే అయినా.. అరుదుగా ఇలాంటివి బోలెడంత ఫ‌న్‌ని క్రియేట్ చేస్తుండ‌డం అప్పుడ‌ప్పుడు చ‌ర్చ‌కొస్తోంది. `హాయ్ మ్యాడ‌మ్‌` ఈ ఫోటో చూశారా? అంటూ స‌ద‌రు అభిమాని ఉపాస‌నకు ఈ పిక్‌ని ట్వీట్ చేశాడు. `రంగ‌స్థ‌లం` చిట్టిబాబు డాడ్‌తో ఇలా సైకిల్‌పై వెళ్లే అరుదైన స‌న్నివేశం రియ‌ల్‌గానే తార‌స‌ప‌డితే అది మ‌రింత క్యూరియ‌స్‌. ఏదేమైనా అభిమాని క్రియేటివిటీకి హ్యాట్సాఫ్ చెబుదాం.